ఏపీ సీఎం జగన్ మరోసారి మీడియాకు వార్నింగ్ ఇచ్చారా.. తన వ్యతిరేక మీడియాను వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పారా.. ఏడాది పాలన పూర్తి చేసుకున్న సమయంలో ఆయన తన వ్యతిరేక మీడియాకు హెచ్చరికలు పంపారా.. ఆయన తాజా వ్యాఖ్యలు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా... నిర్వహించిన మనపాలన మీ సూచన కార్యక్రమంలో జగన్ ఈ విషయంపై మరోసారి కుండబద్దలు కొట్టేశారు.

 

 

ఆయన ఏమన్నారంటే.. “ రాయలసీమ కరువు నివారణ కోసం ప్రాజెక్టులు తీసుకువస్తున్నామో.. వాటిపై ఎంత ఆరోపణలు చేస్తున్నారో అందరూ చూస్తున్నారు. మనం యుద్ధం చేస్తుంది.. చంద్రబాబు ఒక్కడితోనే కాదు.. యుద్ధం చేస్తుంది.. ఈనాడు, టీవీ5, ఏబీఎన్‌తో, చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామని మీ అందరికీ చెప్పాల్సిన పనిలేదు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు బాగుపడాలంటే.. నీరు రాని పరిస్థితి అంటూ తన శత్రు మీడియాపై సమర శంఖం మరోసారి పూరించారు.

 

 

ఇప్పుడు జగన్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశం అవుతున్నాయి. జగన్ ఇలా మాట్లాడటం ఇదేమీ కొత్త కాదు. ఆయన ప్రమాణ స్వీకారం వేదికపైనే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఇవే మాటలు చెప్పారు. ఇప్పుడు ఏడాది తర్వాత కూడా జగన్ అవే మాటలు చెబుతున్నారు. అయితే చెప్పుకోవాల్సింది ఏంటంటే.. ఆయన వ్యతిరేక మీడియా ధోరణిలో మాత్రం ఏమార్పూ లేదు. జగన్ సర్కారును టార్గెట్ చేస్తూ కథనాలు అచ్చొత్తుతూనే ఉన్నాయి.

 

 

అయితే జగన్ సర్కారు మాత్రం ఈ ఏడాది కాలంలో పెద్దగా తన శత్రు మీడియాపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఓ జీవో తెచ్చి చాలా కాలమే అయినా దాన్ని ప్రయోగించింది చాలా తక్కువ సార్లు. మరి ఇప్పుడు మరోసారి జగన్ నోటి వెంట వార్నింగ్ రావడం దేనికి సంకేతం.. ఇకపై జగన్ తన వ్యతిరేక మీడియాపై జూలు విదులుస్తారా.. లేక.. గతంలోలాగే వార్నింగ్ ఇచ్చేసి ఆ తర్వాత లైట్ గా తీసుకుంటారా.. చూడాలి.. ఏం జరుగుతుందో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: