రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి బలపడకపోవడనికి కారణం ఆ పార్టీ నాయకులకు సరైన వ్యూహాలు లేకపోవడం, గ్రూపు తగాదాలు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. కేంద్ర నాయకత్వం ఒకవిధంగా ఆలోచిస్తే, రాష్ట్రాల నాయకులు మరో విధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తుండడం ఇవన్నీ, బీజేపీకి శాపంగా మారాయి. ఎప్పుడు ఎవరో ఒకరు లేవనెత్తిన అంశం పైన పోరాడడం తప్ప సొంతంగా రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో రెండు రాష్ట్రాల బిజెపి నాయకులు విఫలమవుతున్నట్టుగానే కనిపిస్తున్నారు.  తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు పెద్ద వివాదమే చెలరేగుతోంది. టిటిడి నిర్ధారణ ఆస్తులను అమ్మాలని పాలకమండలి నిర్ణయం తీసుకోవడం రాజకీయ రంగు పులుముకుంది. 

IHG


దేవస్థానానికి భక్తులు ఇచ్చిన చిన్నా చితక ఆస్తులను కాపాడడం తలకు మించిన భారం కావడంతోనే టీటీడీ పాలక మండలి వీటిని అమ్మాలని చూసింది. ఈ విషయంపై ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ విరుచుకు పడుతోంది. ఈ వ్యవహారంలో టీడీపీకి మద్దతుగా బిజెపి నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ వివాదం కాస్త ముదిరి ఏపీలో రచ్చగా మారింది. దీనిపై బిజెపి సీనియర్ నాయకుడు రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి తీవ్రంగా స్పందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ధారక ఆస్తుల వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ రాజకీయ గందరగోళం సృష్టించేందుకు ఈ విధంగా ఎత్తుగడలు వేస్తోందని, ఆ విషయం తెలియక చంద్రబాబు వ్యూహంలో బిజెపి నాయకులు పడిపోయారు అంటూ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. 

IHG's Own Finds Flaws In Union Budget 2019; Subramanian Swamy Says ...


ఏపీలో వైసీపీ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తోందని, జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించే తీసుకుంటారు అంటూ సుబ్రమణ్యస్వామి చెప్పుకొస్తున్నారు. టీటీడీ నిర్ధారక ఆస్తుల విషయంలో తెలుగుదేశం పార్టీ అనవసర వివాదాన్ని రేపుతూ, అందరిని గందరగోళం లోకి నెత్తుతోందని,  సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ లో ఆలయ ఆస్తులను విక్రయించడాన్ని సుబ్రహ్మణ్యస్వామి ప్రస్తావించారు. ఈ విషయంపై ఎవరు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. బద్రినాథ్, కేదార్ నాథ్ వంటి అత్యంత ప్రాచీన ఆలయాలతో నిండి ఉన్న ఉత్తరాఖండ్ కు దేవభూమిగా పేరు ఉందని, అలాంటి ప్రదేశంలోనే బీజేపీ ప్రభుత్వం ఆలయ ఆస్తులను అమ్మకానికి పెట్టినా ఎవరు నోరు మెదపడం లేదని సుబ్రహ్మణ్యస్వామి గుర్తుచేశారు. 

IHG


ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ధారక అసలు విషయంలో కావాలనే తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోందని చంద్రబాబు వ్యూహంలో బిజెపి నాయకులతో చిక్కుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.  అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన బిజెపి సీనియర్ నాయకుడు టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు భాను ప్రకాష్ పైన సుబ్రహ్మణ్య స్వామి మండిపడ్డారు .2016 లో టిటిడి అమ్మకాలపై అనుకూలంగా తీర్మానం చేసినా, ఆ సమయంలో పాలకమండలిలో భానుప్రకాష్ సభ్యులుగా ఉన్నారని. అప్పుడు ఆ విషయంలో అడ్డుచెప్పకుండా ఇప్పుడు విమర్శలు చేయడం ఏంటని సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు. 

 


ఇప్పుడు ఆందోళన, ఆవేదన చెందుతున్న వారంతా నిజంగా హిందువుల అయితే ఉత్తరాఖండ్ కు వెళ్లి దీక్షలు చేయాలని ఆయన సూచించారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తులను వేలం వేసేందుకు అవకాశం లేకుండా ఏపీ ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన జీవో పై సుబ్రమణ్య స్వామి హర్షం వ్యక్తం చేశారు. సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యలను బట్టి చూస్తే బిజెపి నాయకులు పూర్తిగా చంద్రబాబు ట్రాప్ లో పడిపోయారని ఇది రాజకీయంగా బిజెపికి కలిసొచ్చే అంశం కాదని ఆయన తేల్చినట్టుగా కనిపిస్తోంది. 

 


మొదటి నుంచి బీజేపీ నాయకులు ఎవరూ సొంతంగా ఎదిగే ఆలోచన చేయకుండా పార్టీ భారం మొత్తం ఏదో ఒక పార్టీ మీద వేసి వారి అడుగు జాడల్లో మాత్రమే ముందుకు వెళ్తున్నారు తప్ప బీజేపీ ని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంలో విఫలం అవుతున్నారనే వ్యాఖ్యలు మొదటి నుంచి వినిపిస్తున్నాయి. అయినా నాయకుల్లో మార్పు అయితే కనిపించడంలేదు. ప్రస్తుతానికి ఎటువంటి వివాదం తలెత్తకుండా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నా, ఈ విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: