తెలంగాణా సిఎం  కేసీయార్ అంటే తెలుగుదేశంపార్టీ ఎంతగా వణికిపోతోందో తాజాగా మరోసారి బయటపడింది. బుధవారం మొదలైన రెండు రోజుల మహానాడులో చంద్రబాబునాయుడుతో కలిసి  అనేక మంది నేతలు  మాట్లాడారు. ఎవరు మాట్లాడినా ఏ అంశం మీద మాట్లాడినా ఆవు వ్యాసం లాగ తిప్పి తిప్పి చివరకు జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లటం, ఆరోపణలు చేయటమే ప్రధానంగా హైలైట్ అయ్యింది. తమ పరిపాలన బ్రహ్మాండంగా ఉందంటునే జగన్ పరిపాలన మొత్తం అవినీతి, అరాచకాల మయమని చెప్పుకోవటంతోనే సరిపోయింది.

 

సరే ఇదంతా ఒక ఎత్తైతే తెలంగాణా నేతలు మాట్లాడిన మాటలు కూడా జగన్ అవినీతి గురించేనా ?  తెలంగాణా అధ్యక్షుడు ఎల్ రమణ కూడా జగన్ గురించే ఎక్కువగా మాట్లాడాడు కానీ కేసీయార్ గురించి మాట్లాడింది తక్కువే. అసలు కేసీయార్ పేరు కూడా ఎవరూ ఎత్తలేదు. రమణ మాట్లాడుతూ  ఇచ్చిన హామీలను కూడా తెలంగాణా సిఎం అమలు చేయలేకపోతున్నట్లు చెప్పాడంతే.  ఆరు సంవత్సరాల కేసీయార్ పాలనలో వైఫల్యల గురించి రమణ కనీసం ప్రస్తావన కూడా  తేలేదు.

 

చంద్రబాబునాయుడు మాట్లాడుతూ తెలంగాణాలో తాను చేసిన డెవలప్మెంట్ గురించి చెప్పుకున్నాడే కానీ కేసీయార్ విషయాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. చంద్రబాబు తర్వాత మాట్లాడిన కళా వెంకటరావు, పంచుమర్తి అనూరాధ, బండారు సత్యనారాయణ లాంటి అనేకమంది నేతలు ఉమ్మడి ఏపిలో కూడా చంద్రబాబు పాలన బ్రహ్మాండమనే పొగిడారు.  చంద్రబాబు పాలన బ్రహ్మండమని చెప్పారు కానీ కేసీయార్ పరిపాలన గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి పాలనపైన మాత్రం ఒంటి కాలిపై లేచి ఆరోపణలు, విమర్శలు చేయటానికి పోటిపడ్డారు.

 

2014లో అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ’ఓటుకునోటు’ కేసులో చంద్రబాబు తగులుకున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి కేసీయార్ గురించి మాట్లాడాలంటేనే చంద్రబాబు భయపడిపోతున్న విషయం అందరూ చూస్తున్నదే.  తాను మాట్లాడకపోవటమే కాకుండా నేతలు ఎవరు కూడా కేసీయార్ కు

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: