ఆంధ్రజ్యోతి మీడియా అంటే అది ఎవరికి కొమ్ముకాస్తుందో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో ఎవరికీ పెద్దగా సందేహాలు లేవు. సాక్షి మీడియా అధికారికంగా వైసీపీకి, ఆంధ్రజ్యోతి తదితర మీడియాలు టీడీపీకి అనధికారికంగానా పల్లకీ మోస్తున్నాయన్న సంగతి ఏపీ మీడియాను ఫాలో అయ్యే వారెవరైనా ఇట్టే చెప్పేస్తారు. అయితే ఇలా ఓ సైడ్ తీసుకోవడం వల్లే కొన్ని ఇబ్బందులూ ఉంటాయి.

 

 

ఏదైనా అంశంపై డిస్కషన్ కు పిలిచినప్పుడు ఎదుటి పక్షం వారు వీరి డిబేట్లకు హాజరు కారు. సో.. డిస్కషన్లు ఏకపక్షంగా సాగుతాయి. అలాంటప్పుడు అసలే ఓవైపుగా ఉన్న పక్షపాతం ఈ డిబేట్ల ద్వారా మరింతగా ప్రజలకు తెలిసిపోతుంది. డిబేట్లు కూడా వన్ సైడెడ్ గా చప్పగా సాగిపోతాయి. నిన్న మొన్నటి వరకూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఈ సమస్య ఉండేది. అయితే ఈ ఛానల్ల్లోకి తాజాగా వచ్చిన వెంకటకృష్ణ అనే సీనియర్ జర్నలిస్టు వల్ల ఆ సమస్య కొంత తీరినట్టు కనిపిస్తోంది.

 

 

వెంకటకృష్ణ చాలా సీనియర్ జర్నలిస్టు. ఈటీవీ, టీవీ5, ఏపీ 24 ఇంటూ 7 వంటి ఛానళ్లలో పని చేశారు. అందువల్ల ఆయనకు విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాల వల్ల ఏబీఎన్ ఛానల్ కూడా మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏబీన్ ఆంధ్రజ్యోతి టీడీపీ అనుకూల చానల్ అని పేరున్నప్పటికీ వెంకటకృష్ణతో ఉన్న పరిచయం దృష్ట్యా కొందరు డిబేట్లలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.

 

 

తాజాగా నాగబాబు వ్యవహారమే అందుకు ఉదాహరణ. బాలకృష్ణను తీవ్రంగా విమర్శిస్తూ వీడియో పోస్టు చేసిన నాగబాబును వెంకటకృష్ణ డిబేట్ కు ఆహ్వానించారు. సాధారణంగా నాగబాబు వంటి వారు ఏబీఎన్ డిస్కషన్లు రారు. కానీ వెంకటకృష్ణతో ఉన్న పరిచయం కొద్దీ ఆయన లైవ్ డిస్కషన్ కు ఒప్పుకున్నారు. ఆ విషయం ఆయన లైవ్‌లోనే చెప్పేశారు. ఏబీన్ పక్కా టీడీపీ అనుకూల ఛానల్ అని తెలిసి కూడా డిష్కషన్ కు వచ్చానని ఆయన లైవ్‌లోనే చెప్పేశారు. సో.. అలా వెంకటకృష్ణ ఇమేజ్ ఏబీఎన్‌కు ప్లస్ పాయింట్ అయ్యిందన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: