వివాదాలు బాలయ్యకు కొత్తేమీ కాదు. అసలు వివాదం చుట్టూనే బాలయ్య తిరుగుతూ ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో వ్యక్తిగా బాలయ్య నిలుస్తూ ఉంటారు. అభిమానులను కొట్టాలన్నా, తిట్టాలన్నా బాలయ్య ముందు వరుసలో ఉంటారు. అవును ఆయన బ్లడ్ బ్రీడు వేరే మరి. ఈ బ్లద్దూ, బ్రీడ్ గురించి ఎవరో ఎవరికో చెప్పిన మాటలు కాదు. స్వయంగా బాలయ్య బాబు చెప్పిన మాటలు. ఒకపక్క సినిమా హీరోగా, మరోపక్క రాజకీయ నాయకుడిగా రెండు పడవల మీద కాళ్ళు వేసుకొని ముందుకు వెళ్తున్నాడు బాలయ్య. సరే ఆ పడవ ఒడ్డుకు చేరుతుందా ? లేదా అన్నది ఇప్పుడు అనవసరం కాని, చాలా కాలంగా బాలయ్య చాలా సైలెంట్ అయిపోయారు. బహుశా వాళ్ల పార్టీ ఓడిపోయిందనే బాధతో సైలెంట్ అయ్యారేమో అని అనుకున్నారు. కానీ ఆ నట సింహం మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చింది. తన పంజా విసిరేందుకు సిద్ధమైంది. 

IHG's powerful Dialogues


గత టీడీపీ ప్రభుత్వం హయాంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అన్ని వ్యవహారాలను బాలయ్య బాబు చక్కబెట్టే వాడు. ఏ కార్యక్రమమైనా బాలయ్య చేతుల మీదుగానే వెళ్ళేది. ప్రభుత్వం నిర్వహించే సినిమా వేడుకలకు అతిథులుగా ఎవరిని పిలవాలి అన్న విషయంలోనూ బాలయ్యే సర్వాధికారి. స్వయంగా ఈ మాటలు ఆయనే చెప్పుకున్నారు. తన తలపైకి ఎక్కి కూర్చునే వాళ్ళను నేనెందుకు పిలుస్తాను ? నాకు కావాల్సిన వాళ్లను మాత్రమే పిలుస్తాను. ఇదంతా నా కష్టం అంటూ బాలయ్య ఆ మధ్య కాలంలో భారీ డైలాగులు పేల్చారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే, తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఓటమి చెందింది. బాలయ్య హవా పూర్తిగా తగ్గిపోయింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు చాలా మంది వైసిపికి అనుకూలంగా మారిపోయారు. దీంతో బాలయ్య పెత్తనం సినిమా ఇండస్ట్రీలో బాగా తగ్గిపోయింది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా చిరంజీవి మారిపోయారు. 

IHG


సినిమా వ్యవహారాలకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఎవరైనా పెద్దలను కలవాలన్నా, మొత్తం అన్ని వ్యవహారాలను చిరంజీవి ఒక్కరే చక్కబెడుతున్నారు.దీనికోసం ఆయన ప్రత్యేకంగా ఒక టీమ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో నాగార్జున లాంటి వారు ఉన్నారు. ఇదంతా కొద్ది రోజులుగా జరుగుతున్న వ్యవహారం. తాజాగా కరోనా క్రైసిస్ ఛారిటీపేరుతో ఒక తాత్కాలిక కమిటీని వేసుకుని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ల  కష్టాన్ని తీర్చేందుకు చిరంజీవి నేతృత్వంలోని మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు.ఈ కమిటీలో నాగార్జున, నిర్మాత సురష్ బాబు, దిల్ రాజు, సి. కళ్యాణ్, జెమినీ కిరణ్, దాము ఉండగా, దర్శకులు రాజమౌళి,కొరటాల శివ, మోహర్ రమేష్ ఎన్ కౌంటర్ శంకర్, త్రివిక్రమ్ వంటి వారు వెళ్లి తమ కష్టాలను మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ కు చెపుతున్నారు.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SMART PHONE' target='_blank' title='phone-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>phone</a> call for Megastar


 ఇదే బాలయ్యకు ఆగ్రహం కలిగించింది. ఇంత పెద్ద సీనియర్ ను కావాలనే పక్కన పెడుతున్నారనే , ఆగ్రహంతో బాలయ్య భారీ డైలాగులు పేల్చాడు. వీరంతా కలిసి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి భూములు పంచుకుంటున్నారు అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఇది ఇప్పుడు బాలయ్య వర్సెస్ సినిమా ఇండస్ట్రీ అన్నంతగా వివాదం ముదిరిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో తనను ఏకాకిని చేస్తున్నారన్న బాధ ఇప్పుడు బాలయ్య బాబు లో  ఎక్కువగా కనిపిస్తోంది. కానీ గత టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా బాలయ్య తీరుని పలువురు సినీ పెద్దలు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు బాలయ్య కు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చేందుకు ఒకరి తర్వాత ఒకరు సిద్ధమైపోతున్నారు.

IHG


 ముందుగా మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. గత కొంతకాలంగా ఆయన అనేక విషయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటున్నారు.అలాగే ఈ విషయంలోనూ ఎంట్రీ ఇచ్చారు. నువ్వు ఏమైనా కింగ్ వా ? నువ్వు ఒక హీరోవి అంతే, ఇష్టం వచ్చినట్లుగా కామెంట్ చేయకు. నువ్వు ఒకటి అంటే మేం పది అంటాం.ఇండస్ట్రీకి, తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పు ముందు. భూములు పంచడానికి పిలవలేదు ఈ ప్రభుత్వం. అసలు రియల్ ఎస్టేట్  గురించి మాట్లాడాలంటే మేము రెడీ ! నువ్వు మీ తెలుగుదేశం ఏపీ ఎలా రియల్ ఎస్టేట్ చేసి ఉద్దరించారో తెలుసు అంటూ నాగబాబు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

IHG


నాగబాబు వాక్యాల్లోనూ రివెంజ్ కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో బాలయ్య బాబు ఏమైనా తక్కువ తిన్నాడా అంటే లేదు. ఇదే మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటూ బాలయ్య గత టీడీపీ ప్రభుత్వం హయాంలో విమర్శలు చేశారు. లేపాక్షి ఉత్సవాల సందర్భంగా చిరంజీవిని పిలుస్తున్నారా అని మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నకు నో పిలవడం లేదు... పిలవను. నా నెత్తి మీద ఎక్కి కుర్చునేవారిని నేను ఎందుకు పిలుస్తాను ? ఎవరిని పిలవాలో వాళ్ళనే పిలుస్తాను. ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు. నా పద్ధతిలో నేను వెళ్తాను. అంటూ ఆవేశంగా బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలు మెగా బ్రదర్స్ తో పాటు మెగా ఫాన్స్ ఎవరు ఇప్పటికీ మర్చిపోలేదు. ఈ ఎపిసోడ్ ఇప్పట్లో అయ్యేది కాదు. దీనికి రాజకీయ రంగు కూడా పులుముకుని అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే బాలయ్య విమర్శించినవారిలో టీఆర్ఎస్ మంత్రి ఉన్నాడు కాబట్టి ఇది డైలీ సీరియల్ లా కొంతకాలం నడుస్తుంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: