నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఇప్పుడు ఈయన్ని ఏమని సంబోధించాలో కూడా అర్థం కాని పరిస్థితి.. మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అందామంటే.. కోర్టు ఆర్డినెన్సును హైకోర్టు కొట్టేసిందాయే.. పోనీ.. అలాగని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అందామంటే.. ఇంకా చార్జ్ తీసుకోలేదాయో.. తాను బాధ్యతలు స్వీకరించానని ఆయన చెబుతున్నా.. అలా కుదరదని సర్కారు అంటోంది. ఎన్నికల కమిషన్ కార్యదర్శి కూడా అబ్బే ఆయన ఇంకా చార్జ్ తీసుకోలేదనే అంటున్నారు.

 

 

అయితే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చంద్రబాబు మనిషి అని వైసీపీ నాయకులు మొదటి నుంచి వాదిస్తూనే ఉన్నారు. కానీ.. అయితే ఓ అధికారికి, పార్టీకి సంబంధం ఎలా అంటగడతారని టీడీపీ నాయకుల వాదన. అయితే జగన్ సర్కారు అరాచకం సృష్టిస్తోందంటూ కేంద్రానికి రమేశ్ కుమార్ పంపిన ఫిర్యాదు కూడా తెలుగు దేశం నాయకుల నుంచే వస్తే దానిపై సంతకం పెట్టి రమేశ్ కుమార్ కేంద్రానికి పంపారని వైసీపీ ఆరోపించింది కూడా.

 

 

తాజాగా హైకోర్టు తీర్పును తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ అటు రమేశ్ కుమార్, ఇటు వైసీపీ నేతలు మాటల యుద్ధం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో టీడీపీ నేతలు దూకుడు ప్రదర్శిస్తున్నారు. చంద్రబాబు మొదలుకుని.. గల్లీ నేత వరకూ ఈ అంశంపై ప్రెస్ మీట్లు పెడుతున్నారు. దీంతో వైసీపీ నాయకులు కూడా ఎదురు దాడి చేస్తున్నారు. అసలు దీనిపై టిడిపి నేతలు ఎందుకు హడావిడి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

 

 

అసలు మీకు ఎందుకు అంత ఆతృత ? నిమ్మగడ్డ రమేష్ పై మీకు ఉన్న ఆసక్తి ఏమిటి?ఎన్నికల కమిషనర్ పదవీకాలాన్ని మూడేళ్లకు తగ్గిస్తే మీకు వచ్చిన నష్టం ఏమిటి? అంటూ వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. టీడీపీకీ, నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కూ లింకు ఉందని తాము మొదటి నుంచి చెబుతున్నామని.. ఇప్పుడు టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ ద్వారా మరోసారి ఈ విషయం రుజువైందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: