అసాధ్యమనుకున్న తెలంగాణ సుసాధ్యమైంది. స్వర్ణ కాంతులీనుతోంది. తన నిధులను తన బాగు కోసం వినియోగిస్తూ ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఈ శుభవేళ. ఆరు దశాబ్దాల స్వప్నం సాకారంకావడంలో వేలమంది ప్రాణాలు తృణప్రాయంగా అర్పించారు. మరికొందరు కీలక పాత్ర పోషించారు వారిని ఒక్కసారి స్మరించుకోవడం అవసరం.

 

IHG

వీరిలో ముందుగా స్మరించుకోవాల్సింది మర్రి చెన్నారెడ్డిని. 1969 ఉద్యమానికి నాయకత్వం వహించి ఉరకలెత్తించిన నాయకుడు. కాంగ్రెస్ హైకమాండ్ ను ధిక్కరించి మొదటి సారి తెలంగాణ ప్రజాపార్టీ పేరుతో ఓ రాజకీయ పార్టీని విజయపథంలో నడిపించిన నాయకుడు. తెలంగాణలో ఏకంగా 11 ఎంపీ సీట్లలో జయకేతనం ఎగరేసింది తెలంగాణ ప్రజాపార్టీ. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఒత్తిళ్లకు తలొగ్గి తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి ఉద్యమ ద్రోహిగా చరిత్రలో ముద్ర వేయించుకున్నా... తెలంగాణ గొంతుకను ఆ స్థాయిలో వినిపించగలిగింది మాత్రం చెన్నారెడ్డి అని చెప్పక తప్పదు.

 

IHG

ఆ తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్న తెలంగాణవాదం.. తెలుగుదేశం రాకతో మరింతగా నిద్రాణంలోకి జారుకుంది. మళ్లీ దాన్ని తట్టిలేపిన ఘనత ప్రోఫెసర్ జయశంకర్ కు దక్కుతుంది. తెలంగాణకు జరిగిన అన్యాయంపై సాధికారికంగా పరిశోధన చేసిన జయశంకర్ తన జీవితమంతా తెలంగాణ కోసం అర్పించాడు. తెలంగాణ అవసరాన్ని అనేక వేదికలపై చాటాడు. తెలంగాణవాదాన్ని సజీవంగా ఉంచాడు.

 

IHG

అలా జయశంకర్ ఊపిరిలూదిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ బావుటాగా మారాడు. ఉవ్వెత్తున కదం తొక్కించాడు. తెలుగు దేశం నుంచి బయటకొట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణవాదానికి ఐకాన్ గా మారాడు కేసీఆర్. 13 ఏళ్ల నిరంతరాయ పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు చవి చూసి.. చివరకు తన ఆమరణ దీక్షతో తెలంగాణ ఉద్యమానికి విజయాన్ని అందించాడు.

 

IHG's condition deteriorates - The Hindu

 

2009 ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్ పరాజయం తర్వాత ప్రోఫెసర్ కోదండరామ్ తెరపైకి వచ్చారు. తెలంగాణ జేఏసీని సమర్థంగా నడిపించి కేసీఆర్ ఉద్యమంలో చురుకుగా లేకపోయినా.. ఉద్యమకాంక్షను రగిల్చాడు. తెలంగాణ ఉద్యమంలోకి సకల జనులను ఏకం చేసిన కోదండరామ్ కొద్దికాలమే అయిన తనవంతు పాత్రను చరిత్ర గుర్తుంచుకునేలా పోషించాడు.

 

IHG

ఇక తెలంగాణకు పైన చెప్పుకున్న వారిలో అంతా కీలకపాత్రదారులే అయినా అసలు తెలంగాణ కలను సాకారం చేసిన వ్యక్తిగా సోనియాగాంధీని చెప్పుకోకపోతే.. అది అసంపూర్ణమే అవుతుంది. ఆమె ఇచ్చిన మాట తప్పకూడదని పట్టుబట్టబట్టే.. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ దెబ్బ తింటుందని తెలిసి కూడా తెలంగాణ ఏర్పాటుకు మొగ్గుచూపింది. ముఖ్యులుగా వీరిని స్మరించుకున్నా.. తెలంగాణ కోసం ప్రాణాలను తృణ ప్రాయంగా వదిలిన అమరవీరులే తెలంగాణ ఆవిర్భావానికి పునాది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: