ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా వ్యాపార‌, వ్య‌వ‌సాయ‌, రాజ‌కీయ, సినిమా రంగాల్లో క‌మ్మ సామాజిక వ‌ర్గం ఆధిప‌త్యం న‌డుస్తూ వ‌స్తోంది. అనేక అంశాలు ఈ సామాజిక వ‌ర్గ ఆధిప‌త్యానికి కార‌ణ‌మ‌య్యాయి. ఇక ఎన్టీఆర్ టీడీపీ పెట్టాక ఇది మ‌రింత ఎక్కువైంది. తెలంగాణ‌లోనూ, కోస్తాలోనూ క‌మ్మ‌లు రాజ‌కీయంగా కూడా మ‌రింత ముందుకు వ‌చ్చి ఆధిప‌త్యం సాధించారు. అప్ప‌టికే ఇటు తెలంగాణలోనూ.. అటు ఉత్త‌రాంధ్ర‌కు విస్త‌రించిన క‌మ్మ‌ల‌కు తెలుగుదేశం పార్టీ మ‌రింత ఆధిప‌త్యానికి, అభివృద్ధికి కార‌ణంగా నిలిచింది. వాస్త‌వానికి తెలుగుదేశం పార్టీ పుట్టాకే క‌మ్మ‌లు రాజ‌కీయంగా ఆధిప‌త్యం చెలాయించార‌ని అనుకుంటారు. అయితే అంత‌కంటే ముందుగానే నాటి కాంగ్రెస్ పాల‌న‌లోనూ వీరు రాజ‌కీయ‌, ఆర్థిక‌, వ్యాపార రంగాల్లో ముందు ఉంటూ వ‌చ్చారు.

 

ఇక ఎన్టీఆర్ టీడీపీ పెట్టాక స‌మైక్యాంధ్ర‌లో ఆ పార్టీయే ఎక్కువ కాలం అధికారంలో ఉంది. చంద్ర‌బాబు కావ‌చ్చు లేదా ఎన్టీఆర్ కావ‌చ్చు వీరిద్ద‌రే టీడీపీ పాల‌న‌లో ముఖ్య‌మంత్రులుగా ఉండ‌డంతో క‌మ్మ‌ల రాజ‌కీయ ప్రాబ‌ల్యం మ‌రింత విస్త‌రించింది. అయితే 1989లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు కాని.. 2004, 2009లో కాంగ్రెస్ గెలిచిన‌ప్పుడు కాని కూడా క‌మ్మ‌ల డామినేష‌న్‌కు, వారి హ‌వాకు ఏ మాత్రం ఇబ్బంది లేదు. 2014లో తెలంగాణ‌లో గెలిచిన కేసీఆర్ సైతం క‌మ్మ‌ల‌కు ప్ర‌యార్టీయే ఇచ్చారు. ఎప్పుడు అయితే 2018 ఎన్నిక‌ల్లో క‌మ్మ‌ల డామినేష‌న్ ఉన్న ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ఎస్ చిత్తుగా ఓడిందో అప్ప‌టి నుంచి కేసీఆర్ వీళ్ల ప్ర‌యార్టీని ప‌క్క‌న పెడుతూ వ‌చ్చారు.

 

ఒక‌ప్పుడు తెలంగాణ రాజ‌కీయాల‌ను శాసించిన క‌మ్మ‌లు ఇప్పుడు ఖ‌మ్మం జిల్లాకు ప‌రిమిత‌మ‌య్యారు. అక్క‌డ ఎంపీగా ఉన్న సీనియ‌ర్ పొలిటిషీయ‌న్ నామా నాగేశ్వ‌ర‌రావు లాంటి వాళ్లు టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నా చేయ‌డానికేం లేదు. ఇక తెలంగాణ‌లో వెల‌మ‌లు, రెడ్ల రాజ‌కీయ ఆధిప‌త్యంతో పాటు ఇటీవ‌ల బీసీలు బాగా పుంజుకున్నారు.. అదే టైంలో క‌మ్మ రాజ‌కీయం నామ‌మాత్ర‌మైంది. ఇక ఏపీలో ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో క‌మ్మలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. అందుకే ఎన్నిక‌ల వేళ క‌మ్మ‌ల‌పై మిగిలిన కులాల్లో వ్య‌తిరేక‌త పెరిగింది. టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. అదే టైంలో వైసీపీ నుంచి పోటీ చేసిన క‌మ్మలు మాత్రం గెలిచారు.

 

ఇక జ‌గ‌న్ సీఎం అయిన యేడాది కాలంలో క‌మ్మ‌ల తోక‌లు ఎక్క‌డిక‌క్క‌డ క‌ట్ చేస్తూ వ‌చ్చారు. గ‌త మూడు ద‌శాబ్దాలుగా క‌మ్మ‌లు ఎప్పుడూ ఇంత ఇబ్బంది ప‌డ‌లేదు. ఇక అమ‌రావ‌తి క‌మ్మ‌రావ‌తి అయిపోయింది. రాజ‌ధానుల విభ‌జ‌న కూడా క‌మ్మ రియ‌ల్ ఎస్టేట్ ఆధిప‌త్యాన్ని దెబ్బ‌కొట్టేసింది. ఇక మ‌రి కొంద‌రు క‌మ్మ‌లు బాబును న‌మ్ముకుంటే రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేద‌ని జ‌గ‌న్ చెంత చేరిపోతున్నారు. దీంతో జ‌గ‌న్‌ను తాము ఢీ కొట్ట‌లేమ‌న్న విష‌యం టీడీపీలో ఉన్న క‌మ్మ‌ల‌కు అర్థ‌మైంది. ఇక కొద్ది రోజులుగా చంద్ర‌బాబు &  గ్యాంగ్ కాపుల‌ను కలుపుకుని ముందుకు వెళ‌దామ‌ని అనుకుంటున్నా అది కూడా వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు. కాపులు చంద్ర‌బాబును ఎంత మాత్రం న‌మ్మే ప‌రిస్థితుల్లో లేరు.

 

2024 నాటికి వైసీపీను ఢీకొనడానికి అటు భాజపాకు, ఇటు కాపులకు, మధ్య తమకు వారథిలా పవన్ కళ్యాణ్ వుండేలా వ్యూహాలు రచించుకుంటూ వస్తున్నారు. అయితే నాగ‌బాబు, ముద్ర‌గ‌డ‌తో పాటు ప‌లువురు కాపుల‌కు అస్స‌లు బాబు, టీడీపీ అంటే పొస‌గ‌డం లేదు. చిరంజీవి సైతం బాబుకు దూరంగా జ‌గ‌న్‌, కేసీఆర్‌కు ద‌గ్గ‌ర అవుతున్నారు. ఇక బీసీలు ఇప్ప‌టికే టీడీపీకి దూర‌మ‌య్యారు. అస‌లు నాగ‌బాబు అయితే మ‌ళ్లీ టీడీపీ అధికారంలోకి రావ‌డం క‌లే అని చెపుతున్నారు. మ‌రి ఇలాంటి దుర్బర ప‌రిస్తితుల్లో బాబోరు ఎవ‌రిని క‌లుపుకుని జ‌గ‌న్‌పై పోరాటానికి సిద్ధ‌మ‌వుతారో ?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: