ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఈనాడు మీడియా సంస్థ‌ల‌కు ఉన్న వైరం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఉన్న‌ప్ప‌టి నుంచే ఈనాడు వైఎస్‌.. ఆ త‌ర్వాత జ‌గ‌న్‌పై విషం చిమ్ముకుంటూ వ‌చ్చేవి అన్న అభిప్రాయం ఉంది. 2014 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్‌పై తీవ్ర స్థాయిలో విషం చిమ్మిన ఈనాడు 2019 ఎన్నిక‌ల‌కు ముందు కూడా అదే పంథాలో వెళ్లింది. జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఐదేళ్లు అస్స‌లు ఏ మాత్రం జ‌గ‌న్‌, వైసీపీ వార్త‌ల‌కు ప్ర‌యార్టీ ఇవ్వ‌లేదు. 

 

ఇక ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు చిత్తుగా ఓడిన‌ప్ప‌టి నుంచి ఈనాడు వైఖ‌రి క్ర‌మ‌క్ర‌మంగా మారుతూ వ‌స్తోంది. క‌రోనాతో క‌లిసే ముందుకు వెళ్లాల‌ని జ‌గ‌న్ ముందుగా చేసిన వ్యాఖ్య‌లు అంద‌రూ అవ‌హేళ‌న చేసినా త‌ర్వాత అంద‌రూ అదే బాట‌లో వెళుతుండ‌డంతో జ‌గ‌న్ మాట‌ల‌కు మంచి ప్ర‌యార్టీ వ‌చ్చింది. ఆర్‌బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ రంగ‌రాజ‌న్ సైతం జ‌గ‌న్‌ను స‌మ‌ర్థిస్తూ మాట్లాడారు. వీటికి ఈనాడు తిరుగులేని ప్రాధాన్యి ఇస్తే సాక్షి చేతులు ఎత్తేసింది. జ‌గ‌న్ పాల‌న‌, ద‌క్ష‌త‌, స‌మ‌ర్థ‌త‌పై ఈనాడు ఇటీవ‌ల దమ్మున్న క‌థ‌నాలు ఇస్తుంటే సాక్షి ఈ విష‌యంలో కాస్త వెన‌క‌ప‌డుతుంద‌న్న చ‌ర్చ‌లు ఏపీ మీడియా, రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

 

ఇక తాజాగా ఏపీలో కొత్త ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డుల‌పై ఈనాడు స‌మ‌గ్ర వివ‌రాల‌తో కూడిన క‌థ‌నం ఇచ్చింది. ఈ క‌థ‌నం జ‌గ‌న్ వ్య‌తిరేకుల‌కు కూడా చెంప పెట్టు అనేలా ఉంది. సాక్షి మాత్రం ఈ విష‌యంలో వెన‌క ప‌డింది. మ‌రి జ‌గ‌న్ సొంత ప‌త్రిక‌, అధికార ప‌త్రిక‌గా ఉన్న సాక్షి ఈ విష‌యంలో ఎందుకు ఫెయిల్ అయ్యింది అన్న‌ది మాత్రం ఆలోచించు కోవాల్సిన విష‌యం.  రూ.18 వేల కోట్ల పెట్టుబ‌డుల‌తో ప‌రిశ్ర‌మ‌లు స్థాపించే క‌థ‌నం ఈనాడులో రావ‌డమే జ‌గ‌న్‌కు ఎక్కువ ప్ర‌యోజ‌నం క‌లిగిస్తుంద‌ని ఖ‌చ్చితంగా చెప్పాలి.

 

ఈ విష‌యంలో ఈనాడును అభినందించాల్సిందే. అయితే సాక్షి సైతం ఇక‌పై ఇలాంటి విష‌యాల్లో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం చెపుతోంది. ఏదేమైనా ఈనాడు రోజు రోజుకు జ‌గ‌న్ ఫ్యాన్స్‌కు ద‌గ్గ‌ర‌వుతోంటే... సాక్షి వైసీపీ వ‌ర్గాల‌ను మ‌రింత ఓన్ చేసుకునే విష‌యంలో వెన‌క‌ప‌డుతున్న‌ట్టే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: