ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడులో శాడిజం పెరిగిపోతోందా ? ఆయన వైఖరిని దగ్గర నుండి గమనిస్తున్న వాళ్ళకు ఇదే అనుమానాలు పెరిగిపోతోంది. ముఖ్యమంత్రిగా ఉంటే తానే ఉండాలనే తత్వం బాగా పెరిగిపోయినట్లుంది. తాను కాకుండా మరెవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళని సవ్యంగా పరిపాలన చేయనిచ్చేది లేదన్నట్లుగా ఉంది చంద్రబాబు రాజకీయాలు. గడచిన ఏడాది కాలంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన విషయంలో చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను చూస్తున్న చాలామంది ఆశ్చర్యపోతున్నారు.  తాను వ్యతిరేకించటమే కాకుండా ప్రతిపక్షాల నేతలందరినీ కూడేసుకుని జగన్ పై పోరాటాలు చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నాడు.

 

నిజానికి జగన్ పరిపాలనపై చంద్రబాబు అండ్ కో చేస్తున్న ఆరోపణలు చాలా దారుణంగా ఉంటున్నాయి. ప్రతిచిన్న విషయాన్ని జగన్ కు ముడేసేసి తనకు  మద్దతుగా ఉండే ఎల్లోమీడియాలో బురద చల్లిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. పరిపాలనలో రాజకీయంగా జగన్ ను నిలువరించటంలో చంద్రబాబుతో సహా ప్రతిపక్షాలన్నీ ఫెయిలయిన విషయం అందరూ చూస్తున్నదే. అందుకనే నేరుగా ఎదిరించే శక్తి లేకపోవటంతో ప్రతి చిన్న విషయానికి కోర్టులను అడ్డం పెట్టుకుంటున్నాడు.

 

గడచిన ఏడాదిలో జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలు కోర్టుల్లో వీగిపోతున్న విషయం అందరూ చూస్తున్నదే. పేదల పిల్లలకు ఇంగ్లీషుమీడియం స్కూళ్ళు ప్రవేశపెట్టటం, పేదలకు అమరావతి ప్రాంతంలో పట్టాలు ఇవ్వటం, మూడు రాజధానుల ప్రతిపాదన ఇలా నిర్ణయం ఏదైనా కానీండి తన మద్దతుదారులతో చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకుంటున్నాడు. నిజానికి జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా చంద్రబాబు అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్ తీసుకునే నిర్ణయాల వల్ల జనాలు నష్టపోతారనే అనుకుందాం. అప్పుడు జనాలే జగన్ కు ఎదురు తిరుగుతారు.

 

జగన్ కు జనాలు ఎదురుతిరిగితే చంద్రబాబుకే కదా మంచిది. అప్పుడు జనాలు జగన్ను వదిలిపెట్టి  ఆటోమేటిక్ గా టిడిపివైపుకే తిరుగుతారు. ఇంతచిన్న లాజిక్ కూడా మిస్సవుతున్న చంద్రబాబు మాత్రం పొద్దున లేచింది మొదలు జగన్ పై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతునే ఉన్నాడు. తన హయాంలోని ఐదేళ్ళల్లో అన్నీ రంగాల్లోను విఫలమైన చంద్రబాబు ఇపుడు ఏడాది కాకుండానే జగన్ ఫెయిలైనట్లు ఆరోపణలు చేస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. జగన్ ఫెయిలైనట్లు చెప్పాల్సింది చంద్రబాబు అడ్ కో నో లేకపోతే ఎల్లోమీడియానో కాదు జనాలన్న విషయాన్ని మరచిపోయాడు.

 

ఈనెల 19వ తేదీన జరగనున్న రాజ్యసభ ఎన్నికల విషయాన్నే తీసుకుంటే చంద్రబాబులోని శాడిజం బయటపడుతుంది. ఏపిలో ఖాళీ అయ్యింది నాలుగు స్ధానాలు. అసెంబ్లీలో సంఖ్యా రీత్యా అన్నీ స్ధానాలు వైసిపికే దక్కుతాయి. ఎందుకంటే ఓటింగ్ అంటూ జరిగితే  ప్రతి రాజ్యసభ సభ్యునికి 35 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి. వైసిపికి కావాల్సినన్ని ఓట్లున్నాయి. మరి టిడిపి సంగతేమిటి ? టిడిపికి ఉన్నదే 23 మంది ఎంఎల్ఏలు. ఇందులో కూడా ముగ్గురు ఎంఎల్ఏలు చేజారిపోయారు. మిగిలిన 20 మంది ఎంఎల్ఏల్లో కూడా పార్టీకి ఓట్లేసేది అనుమానమే. ఇటువంటి సమయంలో టిడిపి తరపున వర్ల రామయ్యను పోటికి  దింపటమంటే శాడిజం కాక మరేమిటి ?

మరింత సమాచారం తెలుసుకోండి: