ఈ హెడ్డింగ్ ఇప్పుడు తెలుగు మీడియా వ‌ర్గాల్లో పెద్ద షాకింగ్ న్యూస్ గా మారింది. అదేంటి ఆంధ్ర‌జ్యోతి ఈనాడు, సాక్షిని బీట్ చేసేసిందా ? ఇది ఎప్పుడు జ‌రిగింది మాకు తెలియ‌దే అని షాక్ అవుతున్నారా ?  ఇది నిజమే జ్యోతి ఈనాడు, సాక్షిని దాటేసి ఫ‌స్ట్ ప్లేస్‌కు వెళ్లిపోయింది. అదే టైంలో జ్యోతితో పోటీ ప‌డ‌లేక ఈనాడు, సాక్షి రెండో ప్లేస్‌కు ప‌డిపోయాయి. ఇది ఏ స‌ర్కులేష‌న్ లోనే.. లేదా రీడ‌ర్ షిఫ్‌లోనే లేదా ప్ర‌క‌ట‌న‌ల్లోనే లేదా ఆదాయంలోనో కాదు సుమా.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను కీర్తించే క్ర‌మంలో ఆంధ్ర‌జ్యోతి ఈనాడు, సాక్షిని బీట్ చేసేసింది.

 

ఇటీవ‌ల తెలంగాణ‌లో ఏదో వెలుగు లాంటి ప‌త్రిక‌లు త‌ప్పా కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా వార్త‌లు రాసే సీన్ ఎవ్వ‌రికి లేద‌న్న నిజం ఒప్పుకుని తీరాలి. ఇక ఇప్పుడు తెలంగాణ‌లో సీఎం కేసీఆర్ ను కీర్తించేం దుకు ప‌లు మీడియా సంస్థ‌లు ఎలా పోటీ ప‌డుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఆరేళ్లు పూర్తి చేసుకున్న వేళ జూన్ 2న ఆయ‌న్ను కీర్తించేందుకు అన్ని మీడియా సంస్థ‌లు రెడీ అయ్యాయి. రెండు .. మూడు రోజుల ముందు నుంచే కీర్త‌న‌లు రెడీ చేసుకున్నాయి.

 

అయితే ఆంధ్ర‌జ్యోతి వీట‌న్నింటికి షాక్ ఇచ్చింది. ఒక రోజు ముందుగానే ఫ‌స్ట్ పేజ్‌తో కేసీఆర్‌ను కీర్తించేసింది.  ఒకరోజు ముందుగానే ఆంధ్రజ్యోతి ఆర్టికల్​ వేయడంతో.. ఖంగుతిన్నట్టున్నాయి. డప్పు కొట్టడంలో వెనుకడుగు వేశామే అని ఆ మీడియా సంస్థ‌ల వాళ్లు ఫీల‌వుతున్నార‌ట‌. జ్యోతి సిక్స‌ర్ అని హెడ్డింగ్ పెడితే... ఈనాడు ఏకంగా  ‘ఆరోహణం’ అని హెడ్డింగ్​ పెట్టి.. ఆరేళ్ల దీప్తి.. వేన్నోళ్ల కీర్తి. జల సిరుల తెలంగాణ, సాగునీరుకు గోసలేదింక అని పరిచేసింది. ఇక సాక్షి 1,2,3,4,5,6 నెంబర్లన్నీ మావే అని అలా పెట్టేసింది. ఆంధ్రలో ఈ మూడు పత్రికల బాట వేరే అయినా… తెలంగాణలో మాత్రం ఒకటే బాట. ఒకటే వాయిస్ అదే కేసీఆర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: