గడచిన ఆరుమాసాలుగా తెలుగుదేశంపార్టీ వైసిపి రంగులపై చిత్ర విచిత్రమైన ఆరోపణలు చేస్తోంది. పంచాయితీ భవనాలకు వైసిపి రంగులు వేయటాన్ని చంద్రబాబునాయుడు, చినబాబుతో పాటు నేతలు, ఎల్లోమీడియా కూడా తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఎల్లోమీడియా చెప్పినా, చంద్రబాబు అండ్ కో చెప్పినా ఒకటే పాయింటు మాట్లాడుతున్నారు. అదేమంటే వైసిపి వల్ల రూ. 1500 కోట్ల ప్రజాధనం వృధా చేసిందని. అంటే పంచాయితీ భవనాలకు రంగులు వేయటానికి ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందనేది వీళ్ళ ప్రధాన ఆరోపణ.

 

అదే విధంగా  కోర్టు తీర్పు నేపధ్యంలో వేసిన రంగులన్నింటినీ తీసేయించాలంటే మరో రూ 1500 కోట్ల ఖర్చవుతుంది కాబట్టి ఏకంగా  రూ. 3 వేల కోట్ల ప్రజాధనాన్ని తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి వల్ల వృధా ఖర్చయ్యిందంటూ చాలా రోజులుగా ఒకటే ఊదరగొడుతున్నారు. అయితే వీళ్ళ ఆరోపణలకు సోషల్ మీడియాలో ఓ ఫిట్టింగ్ రిప్లై వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలోని రిప్లై ప్రకారం రంగులు వేయటానికి అయిన ఖర్చు సుమారు కేవలం రూ. 36 కోట్లు మాత్రమేనట.

 

సోషల్ మీడియాలో వైరల్ అయిన లెక్క ఏమిటంటే రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల భవనాలు ఉన్నవే 12 వేలు.  ప్రతి బిల్డింగ్ విస్తార్ణం మహా ఉంటే 1200 నుండి 1500 చదరపు అడుగులుంటుందట. పై మొత్తం భవనానికి పెయింట్ల కోసం ఎంత నాణ్యమైన రంగులు వాడినా అయ్యే ఖర్చు రూ. 30 వేలకన్నా కాదట. అంటే 12 వేల భవనాలకు తలకు రూ. 30 వేల ఖర్చు. 12000x 30000= 360, 000,000 దటీజ్ 36 కోట్లు. చంద్రబాబు, చినబాబు చెబుతున్న లెక్కల ప్రకారం రూ. 1500 కోట్లెక్కడ, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న లెక్క రూ. 36 కోట్లెక్కడ ?

 

ఒకవేళ టిడిపి చెప్పిన లెక్కే నిజమనుకుందాం. అంటే 1500 కోట్లను 12000తో భాగారించాలి. అప్పుడు ఒక్కో భవనానికి 12.5 లక్షలవుతుంది. నిజంగా ఇది సాధ్యమేనా ? ఎందుకంటే సచివాలయం భవనం మహా అయితే రెండు గదులో లేకపోతే మూడు గదులో ఉంటుందంతే. కాంపౌండులోని మిగిలిన స్ధలమంతా వెహికల్ పార్కింగ్ తదితరాలకు వదిలేస్తారు. 1500 చదరపు అడుగుల్లో కట్టుకున్న ఇంటికే పెయింటింగుల కోసం 12.50 లక్షల రూపాయలు అయ్యే ఛాన్సు లేదు.

 

మరలాంటపుడు చంద్రబాబు, చినబాబుకు ఈ లాజిక్ తెలీదా ? ఎందుకు తెలీదు ? అంతా తెలిసే జగన్ ప్రభుత్వంపై బురద చల్లేస్తున్నారు. ఎల్లోబ్యాచ్ టార్గెట్టే జగన్ పై బురద చల్లటం కాదా ? వీళ్ళకు ఎల్లోమీడియా వంత పాడుతోంది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయొచ్చా ? అంటే వేయకూడదు అన్నదే సమాధానం. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేస్తున్నారనే ఆరోపణల వరకూ వాస్తవమే. కానీ ఆ ముసుగులో వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారన్నది మాత్రం తప్పుడు ఆరోపణే. ఎంతైనా తప్పుడు ఆరోపణలు చేయటంలో చంద్రబాబు, టిడిపి ఆరితేరిపోయారు కదా ?

మరింత సమాచారం తెలుసుకోండి: