మెగాస్టార్ చిరంజీవి బాలయ్య మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. కుంభ వర్షం కురిసేస్తుంది అనుకుంటే సాధారణ వర్షమే కురిసింది. మధ్య మధ్యలో నాగబాబు వంటి వారు ఉరుముల్లా పిడుగుల్లాంటి బాంబులు వేసినా పెద్దగా బాలయ్యకు డ్యామేజ్ జరగలేదు. అసలు ఈ వివాదం ఆటలో అరటిపండులా మెల్లి మెల్లిగా చల్లారిపోతుందని సినీ పెద్దలు కొంతమంది అంచనా వేశారు. పరిస్థితి కూడా అలాగే కనిపించింది. అసలు చిరంజీవి బృందం కనీసం తమ సాటి హీరో ఉన్నాడు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోకుండా, పిలవకుండా టీఆర్ఎస్ పెద్దలను కలవడం జరిగింది. ఏంటి ఏంటి ఇంత పెద్ద హీరోని, మొన్నటి వరకు ఇండ్రస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న తనకు చెప్పకుండా వెళ్లడం ఏంటి అనుకున్నాడో ఏమో తెలియదు కానీ నాలుగు పంచ్ డైలాగులు వేసాడు. ఆ డైలాగులు కాస్తా ఘాటుగానే సీనీ పెద్దలకు, టీఆర్ఎస్ పెద్దలకు తగిలాయి.

IHG


 ఈ వివాదం అలా పెరుగిపోతుండగానే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ను కలిసేందుకు మళ్ళీ అదే చిరు ఆధ్వర్యంలోని బృందం వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. అసలు బాలయ్యతో అనవసర తలనొప్పి అనుకున్నారో ఏమో తెలియదు కానీ, ఏమోయ్ బాలయ్య మేము వెళ్తున్నాం వస్తావా0 అంటూ కబురు పంపించారట. ఆయన ఏమన్నాడో తెలియదు కానీ, ఇక్కడ చిరంజీవి మాత్రం గొప్పగా బాలయ్య బాబుని ఇరికించేసాడు.అసలు జగన్ దగ్గరకు వెళదామని చిరంజీవి పిలిస్తే అసలు బాలయ్య వస్తాడా ? వచ్చే అవకాశం ఉందా ? బాలయ్య సినీ హీరో, కమ్ ఎమ్యెల్యే కాబట్టి అందులోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కి స్వయానా వియ్యంకుడు. 

IHG


అటువంటి వాడు ఆ జగన్ దగ్గరకు ఎందుకు వస్తాడు ..? వస్తే పార్టీ నాయకులు ఏమనుకుంటారో బాలయ్యకు తెలియదా ? ఇది కనిపెట్టే కదా ఆ మెగాస్టార్ అనబడే ఆ చిరంజీవి బాలయ్యను ఆహ్వానించింది ? పిలవలేదు అనే అపనింద తమపైకి రాకుండా, వెంట తీసుకెళ్లకుండా మెగా స్టార్ గొప్ప తెలివి తేటలు ప్రదర్శించాడు. ఇప్పుడు బాల్ బాలయ్య కోర్టులో విసిరేసాడు చిరంజీవి.   

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: