ఏపీలో లో వి పక్ష టిడిపికి వరుసపెట్టి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ నుంచి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ తో పాటు... ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు ముగ్గురు వైసిపి చెంత చేరిపోయారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పలువురు కీలక నేతలు కూడా వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీలు పోతుల సునీత‌, శమంతకమణి, మాజీ ఎమ్మెల్యే యామిని బాల లాంటి కీలక నేతలు అందరూ జగన్ చెంతకు చేరిపోయారు. ఇక రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరగా మరికొందరు నేతలు సైతం బిజెపిలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

 

ఇక ఇప్పుడు ఈ జాబితాలో మరికొందరు నేతలు సైతం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ లిస్టులో మొద‌ట‌గా వినిపిస్తున్న పేరు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ది కావడం విశేషం. వైసీపీ నుంచి రాజకీయం ప్రారంభించిన భూమా అఖిలప్రియ తన తండ్రి దివంగ‌త నేత భూమా నాగిరెడ్డితో కలిసి టీడీపీలోకి జంప్ చేసింది. అయితే తండ్రి హఠాన్మరణంతో ఆమెకు చంద్రబాబు మంత్రి పదవి కట్టబెట్టారు. మంత్రిగా ఆమె తనదైన ముద్ర వేయలేకపోయారు అన్నది వాస్తవం. గత ఎన్నికల్లో ఓడిపోయినా టిడిపి తరఫున ఆమె బ‌లంగా వాయిస్ వినిపిస్తున్నారు. అయితే తాజాగా టీడీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

 

తన హత్యకు మాజీ మంత్రి అఖిల ప్రియ సుపారి ఇచ్చింది అంటూ ఏవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.  తన మీద మీద దాడి జరిగిన రెండు నెలల వరకు తాను సైలెంట్ గా ఉన్నాను అని ఆయ‌న ఆరోపిస్తున్నారు. ఓ వైపు పార్టీ నేత త‌న‌పై ఈ స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నా చంద్ర‌బాబు కాని.. టీడీపీ నేత‌లు కాని త‌న‌కు స‌పోర్ట్ చేయ‌డం లేద‌న్న ఆవేద‌న‌లో ఆమె ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె చంద్ర‌బాబుతో ఓ సారి ఫైన‌ల్‌గా భేటీ అయ్యి తాడోపేడో తేల్చుకుని పార్టీ మారేందుకు.. వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: