సాధారణంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులను చూస్తే ఆంధ్రప్రదేశ్ లో జగన్ ని ఎదుర్కోవడం అనేది విపక్షానికి ఏ మాత్రం కూడా సాధ్యం కాదు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయంగా వైఎస్సార్ పార్టీ ఎంత బలంగా ఉంది అనేది అందరికి తెలిసిందే. అయితే ఇక్కడ కొందరు నేతల తీరు మాత్రం జగన్ ని చాలా చికాకు పెడుతుంది. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను రోడ్డు మీదకు లాగుతున్నారు. దీని వెనుక ప్రధాన కారణం మంత్రుల తీరు. నియోజకవర్గాల్లో జిల్లాల్లో వాళ్ళు వర్గ రాజకీయాలను పెద్ద ఎత్తున పెంచి పోషించే కార్యక్రమాలు చేస్తున్నారు. 

 

ఎవరు ఎన్ని చెప్పినా సరే వినే పరిస్థితి నియోజకవర్గాల్లో ఉండటం లేదు అనే చెప్పాలి. అన్ని జిల్లాల్లోనూ మంత్రులు తమకంటూ సొంత వర్గాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా జిల్లాల్లో మంత్రులకు ఎమ్మెల్యేలకు ప‌డ‌డం లేదు. మరి కొన్నిచోట్ల ఎంపీల మాటలకు మంత్రులు ఏ మాత్రం ప్ర‌ధాన్యం లేకుండా చేస్తూ ఉండడంతో ఎంపీలకు... మంత్రులకు పొస‌గ‌డం లేదు. మరి కొన్ని చోట్ల ఎంపీలకు.. ఎమ్మెల్యేలకు పడటం లేదు. ఇక జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు చెప్పిన ప‌నులు మాత్ర‌మే చేస్తుండడంతో మిగిలిన ఎమ్మెల్యేలు మంత్రుల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇది ఫైనల్ గా పార్టీలో తీవ్ర అసంతృప్తికి కారణం అవుతోంది.

 

దీనితో వాళ్ళ అందరి మీద జగన్ నిఘా పెట్టారు. ఎవరు అయితే మంత్రులు గాని కీలక నేతలు గాని యువనేతలతో కలుపుకుని వెళ్ళడం లేదో వాళ్ళను గుర్తిస్తున్నారు. వాళ్ళు పార్టీకి ఏ మాత్రం కూడా అవసరం లేదని జగన్ ముఖం మీదే చెప్పే పరిస్థితి వచ్చింది. గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు మంత్రులు, నెల్లూరుకి చెందిన ఒక కీలక నేత, మంత్రి, అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మీద ఏ క్షణం అయినా జగన్ చర్యలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి.  అత్యంత నమ్మకస్థులతో జగన్ వారి మీద గురిపెట్టినట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: