ఏపీలో అధికార వైసీపీలో గ‌త కొంత కాలంగా అధికార వైసీపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఇప్పుడు బయటపడుతోందా?.రాబోయే రోజుల్లో ధిక్కార స్వరాలు మరింత పెరిగే అవకాశం ఉందా? అంటే ఏపీ వైసీపీ వ‌ర్గాల్లో ఇప్పుడు అవును అనే ఆన్స‌ర్లే వినిపిస్తున్నాయి. ఎవ‌రు ఏమ‌న్నా ఇందుకు ప్ర‌ధాన కార‌ణం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలే. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌ళ్లీ గెల‌వాల‌న్నా.. త‌న పార్టీ నిలుపు కోవాల‌న్నా మంత్రులు, ఎమ్మెల్యేల‌ను .. నేత‌ల‌ను మాత్రం ఎక్క‌డా న‌మ్ముకున్న‌ట్టు క‌న‌ప‌డ‌డం లేదు. కేవ‌లం త‌న బ్రాండ్ జ‌నాల్లోకి వెళ్లాల‌న్న ల‌క్ష్యంతోనే ప‌ని చేస్తున్నారు. అందుకే జ‌గ‌న్ ప్ర‌ధానంగా ప్ర‌భుత్వం నుంచి నేరుగా సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల‌కు వెళ్లే అంశం మీదే ప్ర‌ధానంగా దృష్టి సారిస్తున్నారు.

 

స‌హ‌జంగానే మంత్రులు, ఎమ్మెల్యేల‌కు వ్య‌క్తిగ‌తం నిధులు వెళ్ల‌క‌పోవ‌డం.. అవినీతి కంట్రోల్ అవ్వ‌డంతో వారు సంపాదించుకు నే మ‌ర్గాలు లేకుండా పోయాయి. ఇవే ఇప్పుడు వారిలో అస‌మ్మ‌తికి.. అసంతృప్తికి కార‌ణ‌మ‌వుతున్నాయి. ఇక ప‌లువురు ఎమ్మెల్యేలు జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోసం నిధులు అడుగుదామ‌న్నా కూడా జ‌గ‌న్ అపాయింట్ మెంట్ ఇవ్వ‌డం లేద‌ని వైసీపీ వ‌ర్గాలే చ‌ర్చించు కుంటున్నాయి. వారి కోరిక మేర‌కు నిధులు కేటాయించే పరిస్థితి లేనందునే సీఎం జగన్ ఎమ్మెల్యేలతో భేటీకి కూడా ఆసక్తిచూపటంలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

ఇక వైసీపీలో ఒక్కొక్క‌రు ఫైర్ అవుతున్నారు. ఈ లిస్టులో చూస్తే ఎమ్మెల్యేలు నల్ల‌పు రెడ్డి ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి ( కోవూరు), ఆనం వెంక‌ట రామనారాయ‌ణ రెడ్డి ( వెంక‌టగిరి), బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు ( వినుకొండ ‌),  కిలారు వెంక‌ట రోశ‌య్య ( పొన్నూరు), ఆర్కే రోజా ( న‌గ‌రి), ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ( శ్రీకాకుళం ), క‌నుమూరు ర‌ఘురామ కృష్ణం రాజు ( న‌రసాపురం ఎంపీ) , డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీ వాణి మామ చంద్ర‌శేఖ‌ర్ రాజు వీరు ఓపెన్ గానే ఇప్ప‌టికే అధికారుల మీద పెట్టో లేదా ప్ర‌భుత్వాన్నో ప‌నులు కావ‌డం లేద‌న్న సాకుతో విమ‌ర్శించారు. 

 

ఇక ఈ 10 మంది ఇప్ప‌టి వ‌ర‌కు బ‌య‌ట ప‌డ‌గా ఈ లిస్టులో రేపో మాపో మ‌రి కొంత మంది కూడా చేర‌బోతున్నార‌ని అంటున్నారు.  తాజాగా రఘురామకృష్ణం రాజు రాష్ట్రంలో ఇసుక మాయం అవుతోందని.ఎంతో పేరున్న ఓ డాక్టర్  లారీ ఇసుక అడిగితే కూడా తాను ఇప్పించలేకపోయానని ప్రకటించారు. వైఎస్ హయాంలో ఇసుక ఎంతో బాగా దొరికేదని అన్నారు. ఓ ఎంపీ గ‌తంలో వార్నింగ్ ఇచ్చినా ఇలా మాట్లాడుతున్నారంటే ప‌రిస్థితి కంట్రోల్ త‌ప్పుతుందా ? అన్న సందేహాలు కూడా సొంత పార్టీ వాళ్ల‌కే వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: