సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ పేరుకి రెండు అర్ధాలు ఉన్నాయి. క్రమశిక్షణకు మారు పేరుగా అధికారపక్షం సంబోధిస్తుంది. నియంతకు మారు పేరుగా ప్రతిపక్షం సంబోధిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే...ఆయన తీసుకున్న నిర్ణయమే ఫైనల్. ఆయన మాటే శాసనం. అలా ఉన్నాడు కాబట్టే 9 ఏళ్ల ప్రతిపక్షంలో అసంతృప్తులు రాకుండా చాలా జాగ్రత్తగా పార్టీని నడిపించి ఇప్పుడు అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తూ.. దేశంలోనూ, ప్రజల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన ఏడాది పాలనలో ఎన్నో ప్రశంసలు అందుకొని, ఎంతో మచి పేరు సంపాధించుకున్నారు సీఎం జగన్. ఇప్పటివరకు అంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడే అసలు కథ మొదలైంది, జగన్ కి కొత్త చిక్కులు తీసుకొచ్చిపెట్టింది.

 

అదేంటంటే, వైసీపీ లో చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అసమ్మతి రాగం వినిపించడం, అధినేత వ్యవహార శైలిని తప్పుబడుతూ మీడియా సమావేశాలు నిర్వహించడం వంటి పరిణామాలు ఈ మధ్య ఆ పార్టీలో తరుచూ జరుగుతున్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఇప్పుడు ధిక్కార స్వరం వినిపించడం చర్చనీయాంశమవుతోంది. ఇవి కాస్త సీఎం జగన్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆయన తీసుకున్న అన్ని నిర్ణయాలను తప్పుబడుతూ అసంతృప్తి వినిపించడం పై జగన్ సీరియస్ అయినట్టు సమాచారం. ఏదైనా సమస్య ఉంటే పార్టీలో, ప్రభుత్వ పెద్దలతో చర్చించుకుని పరిష్కరించుకోవాలి తప్ప ఇలా ఎవరికి వారు రోడ్డు ఎక్కి పార్టీ ప్రభుత్వ పరువు బజారున పడేయడం ఏంటని జగన్ కొంతమంది నేతలు వద్ద సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీంతో త్వరలోనే పార్టీలోని సీనియర్ ఎమ్మెల్యేలతో భేటీ అవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానాలు అందాయట. అలాగే జిల్లా ఇంఛార్జి మంత్రులు కూడా రావాల్సిందిగా పిలుపు అందినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: