మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో కొందరు సినీ ప్రముఖులు మొదట మంత్రి తలసానితో భేటీ అవ్వడం. ఆ తర్వాత సీఎం కేసీఆర్ ని కలవడం, దీనిపై నందమూరి నటసింహం బాలకృష్ణ స్పందిస్తూ...ఈ భేటీలన్నీ భూములు పంచుకోవడానికేనని అనడం, దీనిపై మెగా బ్రదర్ నాగబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడి, ఆయన్ని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం. ఇదంతా అందరికీ తెలిసిన కథే. అలాగే ఓ ఇంటర్వ్యూలో నాగబాబు గురించి ప్రస్తావన రాగ ఛీ..ఛీ.. ఆయనపై నేను స్పందించడమేంటంటూ మౌనం దాల్చారు బాలయ్య. అయితే తాజాగా ఒక ఛానల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్యూలో మరోసారి ఈ వివాదంపై నాగబాబు రియాక్ట్ అయ్యారు. అయితే ఆ వివాదం సమసిపోయిందని, ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేవని నాగబాబు రియాక్ట్ అవ్వడం విశేషం.

 

 "బాలయ్య వ్యాఖ్యలపై నేను రియాక్ట్ అయ్యాను. అలా కామెంట్ చేయడం తప్పు అన్నాను. దానిపై బాలయ్య పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. దీంతో ఆ సమస్య అక్కడితో తీరిపోయింది. నాకు, బాలయ్యతో ఎలాంటి గొడవల్లేవు. మా ఇద్దరికీ పరిచయం కూడా చాలా తక్కువ. ఆవేశపడి మాట్లాడారు కాబట్టి అలా మాట్లాడకూడదని మాత్రమే చెప్పాను. అయితే  నాగబాబు ఇలా అనడం కాస్త కామెడీగా ఉన్నప్పటికీ.. వ్యవహారాన్ని ఇంకా పెద్దది చేయడం ఇష్టంలేక ఇలా మాట్లాడినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇక్కడితో ఆగలేదు నాగబాబు. "భూములు పంచుకున్నారంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఆయన కోపంతో అన్నవే. కావాలని అనలేదు. తర్వాత ఆయన సర్దుకున్నారు. కాబట్టి ఇంతకంటే ఆయనపై ఎక్కువ మాట్లాడ్డం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన వెంటనే ఎడ్జెస్ట్ అయిపోయారు. సి.కల్యాణ్, తమ్మారెడ్డి భరధ్వాజ్ లాంటి వాళ్లు సర్దిచెప్పారు. ఆ ఇష్యూ అక్కడితో క్లోజ్ అయిపోయింది." అని నాగబాబు తెగేసి చెప్పారు.

 

అయితే నాగబాబు ఇలా మాట్లాడటానికి పెద్ద కారణం ఉందని కొందరు భావిస్తున్నారు. అదేంటంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గట్టిగా నాగబాబుకు క్లాస్ పీకారనే వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. నాగబాబు జనసేనలో వుండడం వల్ల ఏ కామెంట్ చేసినా, అది పార్టీ మీద, ఆంధ్ర రాజకీయాల మీద ప్రభావం చూపిస్తుందని, అందుకే పవన్ గట్టిగా క్లాసు పీకారని టాక్ నడుస్తుంది. జగన్ ను ఢీ కొనాలి అంటే తెలుగుదేశం-జనసేన పరోక్షంగానైనా కలిసి వుండాల్సిన అవసరం వుంది, అలా జరిగాలి అంటే కమ్మ-కాపు వర్గాల మధ్య ఎటువంటి భేదాలు రాకూడదు. ఇవన్నీ వివరంగా క్లాసు పీకడంతోనే నాగబాబు వెనక్కు తగ్గి వుంటారన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: