ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్ధం కాని పరిస్థితిలో ఉంది ఆ పార్టీ అధిష్టానం. ఎందుకంటే చంద్ర‌బాబు తో నాలుగు ద‌శాబ్దాలుగా న‌డుస్తూ బాబును నాలుగు ద‌శాబ్దాలుగా ఎంతో ద‌గ్గర నుంచి చూసిన సీనియ‌ర్ నేత క‌ర‌ణం బ‌లరాం లాంటి వాళ్లే ఈ రోజు బాబును న‌మ్మలేక‌... టీడీపీలో ఉంటే త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు లేద‌ని డిసైడ్ అయ్యి ఆ పార్టీకి.. బాబోరికి దూరం దూరంగా జ‌రిగి పోతున్నారు. ఇక బాబు సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు కూడా ఆయ‌న్ను న‌మ్ముకుంటే త‌మ‌కు రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని చెపుతున్నారు. 

 

కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వంశీ సైతం వ‌రుస‌గా రెండో సారి గెలిచినా కూడా టీడీపీలో ఉండ‌లేక ఆ పార్టీకి దూర‌మైన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు బాబోరికి మ‌రో షాక్ త‌గ‌ల‌నుంది. పార్టీ నుంచి కొందరు యువనేతలు వెళ్ళిపోయే సూచనలు ఉన్నాయి. ఈ సమాచారం ఇప్పుడు చంద్రబాబు కి చేరినట్టు వార్తలు వస్తున్నాయి. కొందరు యువనేతలు పార్టీ మారడానికి గానూ కొన్ని రోజల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. 
ఇప్పుడు సదరు యువనేతలు వైసీపీ కి చెందిన ఒక మంత్రితో టచ్ లో ఉన్నారు. 

 

వారు అందరూ కూడా ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన యువనేతలు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని త్వరలోనే వాళ్ళు అందరూ విజయసాయి రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు యువనేతలు ఇప్పటికే జగన్ ని కూడా కలిసారు అని అంటున్నారు. వారిలోమాజీ మంత్రి కుమారుడు కూడా ఉన్నారు అని రాజకీయ వ‌ర్గాల టాక్‌. వీరు అందరూ కూడా అన్నీ అనుకూలిస్తే త్వరలోనే పార్టీ మారడం దాదాపుగా ఖాయమని అంటున్నారు. మరి పార్టీ మారతారా లేదా అనేది చూడాలి. బుజ్జగించినా సరే ఆగే పరిస్థితి లేదని అంటున్నారు. చూడాలి మరి ఎంత మంది టీడీపీకి షాక్ ఇస్తారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: