పత్రికల్లో రారాజుగా వెలుగొందుతున్న ఈనాడు దిన పత్రిక ఇప్పుడు కరోనా కారణంగా విలవిలలాడుతోంది. ఎప్పటి నుంచో మీడియా రంగం తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటూ వస్తోంది. పత్రిక నిర్వహణ భారంగా ఉన్నా, వాటిని యాజమాన్యాలు లెక్కచేయకుండా ముందుకు నడిపించుకుంటూ వస్తున్నాయి. ఇప్పటికే సిబ్బంది జీతభత్యాలు పెరగడం, పత్రిక ముద్రణ ఖర్చులు భారీగా పెరిగిపోవడం, వంటి కారణాలతో పత్రికలు ఎప్పటి నుంచో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మరో వైపు చూస్తే పత్రికల నిర్వహణకు మూలమైన యాడ్స్ క్రమక్రమంగా తగ్గిపోతూ ఉండడం, ప్రభుత్వాల నుంచి వచ్చే అడ్వార్టైజ్మెంట్స్ కూడా తగ్గిపోవడం వంటివి పత్రికల మనుగడకు అవరోధంగా మారాయి. 

IHG


ఎప్పటి నుంచో ఉద్యోగులను తగ్గించుకుంటూ పత్రికలు వస్తున్నాయి. అలాగే ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించారు. ఒక దశలో ఈనాడు దినపత్రిక ప్రింటింగ్ ను నిలిపి వేయాలని ఆదేశాలు ఆ పత్రిక అధిపతి రామోజీరావు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. నిర్వహణ మరింత భారం అవడం, పాఠకుల సంఖ్య తగ్గిపోవడం వంటి విషయాలపై కలత చెందిన  రామోజీరావు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చర్చ నడిచింది. ప్రింటింగ్ పూర్తిగా మానేసి కేవలం ఈ పేపర్ పైన దృష్టి పెడితే బాగుంటుందనే ఆలోచనకు ఈనాడు వచ్చినట్లు సమాచారం. ఈనాడు ఒకటే కాకుండా మిగిలిన పేపర్లు కూడా ఈ పేపర్ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి.

IHG


 ప్రస్తుతం ప్రింటింగ్ ఖర్చులు పెరగడం, నిర్వహణ భారం అవడంతో ఈ పేపర్ అయితే బాగుంటుందన్న ఆలోచనతో పత్రికా యాజమాన్యాలు చాలావరకు వచ్చేసాయి. అందుకే ప్రింటింగ్ ను తగ్గించి ఈ పేపర్ మరింత ఎక్కువ మందికి చేరువ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇటీవల రామోజీ రావు సంస్థలోని ఉద్యోగుల తో సమావేశం నిర్వహించి, ఆ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రింటింగ్ పై దృష్టి తగ్గింది ఈ పేపర్ పై ఎక్కువ ఫోకస్ చేయాలని రామోజీ తన సిబ్బందిని ఆదేశించినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలోనే ప్రింటింగ్ ప్రక్రియ మొత్తం నిలిపివేయాలని రామోజీ ఆలోచించినా చివరి నిమిషంలో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టి మరి కొన్ని నెలల పాటు వేచి చూడాలని నిర్ణయానికి వచ్చారు.


 ఇప్పుడు ఈ పేపర్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆ తర్వాత క్రమంగా ప్రింటింగ్ నిలిపివేస్తే బాగుంటుందనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈనాడు కనుక ఈ బాట పడితే అదే బాటలో పయనించేందుకు అనేక పత్రికల యాజమాన్యాలు చూస్తున్నాయి. ఏది ఏమైనా ప్రస్తుతం పత్రికా రంగానికి ఇది గడ్డుకాలంగానే కనిపిస్తోంది. ఇప్పటికే పాఠకాదరణ బాగా తగ్గిపోయి పత్రికలు మనుగడ కోసం పోరాడుతున్నాయి. ఈ దశలో ఈనాడు ధైర్యంగానే ముందుకు వచ్చినట్లు కనిపిస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: