వైసీపీలో సీఎం జగన్ తర్వాత ఎవరు..? అని ఆడగగానే టక్కున గుర్తొచ్చే పేరు రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి. ఆ పార్టీలో అంత గుర్తింపు ఉంది ఆయనకి. దీనికి ముఖ్య కారణం సీఎం జగన్ కి, విజయ సాయికి మధ్య ఉన్న బంధం. అయితే ఈ బంధం ఈనాటి కాదు.. వైఎస్ ఉన్నప్పటి నుండి జగన్, విజయసాయి ఒకరికొకరు బాగా క్లోజ్. అందుకే అప్పటి కేసుల్లో ఇద్దరూ కలిసి జైలుకి వెళ్లారు. ఆ జైలులోనే వీరి బంధం రాజకీయ అడుగులవైపు మళ్ళింది. అందుకే విజయసాయికి జగన్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆయన వ్యూహాలనే అమలు చేస్తుంటారు. అలాగే విజయ సాయి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటూ తమ రాజకీయ ప్రధాన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. ఆయన పార్టీలో నెంబర్ టు స్థానంలో ఉంటూ వచ్చారు. పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ వ్యవహారాలు ఏదైనా జగన్ వద్దకు వెళ్లాలంటే ముందుగా విజయసాయిరెడ్డి కి తెలియాల్సిందే. అంతగా ఆయన పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పట్టు సాధించారు. అటువంటిది ఇప్పుడు విజయసాయికి కొత్త పరీక్షలు ఎదురవుతున్నాయి అని తెలుస్తుంది. సీఎం జగన్ ఆయనను పక్కన పెట్టారనే వార్తలు పెద్దఎత్తున వస్తున్నాయి. అసలు ఈ వ్యవహారం ఇక్కడి వరకు రావడానికి కారణాలు ఏమిటి అనేది పరిశీలిస్తే..!

 

విశాఖ ఎల్జి పాలిమర్ దుర్ఘటన జరిగిన సమయంలో బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్ వైజాగ్ వెళ్లేందుకు సిద్ధమయిన సమయంలో జగన్ కారులో విజయసాయిరెడ్డి ఎక్కగా, ఆయనను దించి వేసి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ని జగన్ కారులో ఎక్కించుకున్నారు. అక్కడ మొదలయ్యింది విజయసాయికి ఈ రాజకీయ పరీక్ష. విజయసాయిని జగన్ పక్కన పెట్టేసారు అంటూ వీడియోలు, వార్తలు, పుకార్లు బయట చక్కర్లు కొట్టాయి. నాటి నుండి విజయసాయి కాస్త సైలెంట్ అవ్వడంతో ఈ వ్యవహారనికి మరింత బలం చేకూరింది. అప్పటి నుంచి జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి యాక్టీవ్ అయ్యారు. అన్ని వ్యవహారాల్లోనూ ఆయనే హడావుడి చేస్తూ వస్తున్నారు. మీడియా సమావేశాలు నిర్వహిస్తూ బాగా యాక్టివ్ గా ఉంటున్నాడు. విశాఖ ఎల్జి పాలిమర్ సంఘటన పైన జగన్ విజయసాయి రెడ్డిని మాట్లాడొద్దని జగన్ సూచించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. మొత్తంగా చూస్తే విజయ్ సాయి రెడ్డి వ్యవహార శైలిపై జగన్ అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు రావడం, అదే సమయంలో విజయసాయిరెడ్డి సైలెంట్ అవ్వడం మరింత అనుమానాలు పెంచింది.

 

ఈ వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరగడంతో నేరుగా విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి నేను ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటాను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే జగన్, విజయసాయి రెడ్డిల మధ్య గ్యాప్ రావడానికి అసలు కారణం ఏంటనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదు. ఢిల్లీలో ఆయన వైసీపీ సంబంధించి రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టడం లో విఫలమవుతున్నారని జగన్ అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి విజయసాయి రెడ్డి జోక్యం ఎక్కువైందని, అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో తాత్కాలికంగా జగన్ ఆయనను పక్కన పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి 2019 లో సీఎం జగన్ అధికారంలోకి రావడానికి విజయసాయి కీలకంగా పని చేశారు. అటువంటి వారికి ఈ పరిస్థితి, స్వీయ నిరూపణ రావడం కాస్త ఆలోచనలకు, చర్చకు రేకెత్తిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: