భారత్ చైనా సరిహద్దుల్లో అనుక్షణం ఉద్రిక్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. సరిహద్దులు దాటితే హద్దులు మిరుతాం అంటున్నాయి సైనిక వర్గాలు. త్రివిధ దళాలతో అర్థరాత్రులు చర్చలు జరుపుతున్నారు దేశ ప్రధానులు..యుద్ధ ఉద్రిక్తతని ఆసరాగా తీసుకుంటున్న మిత్రా దేశాలు.. వీడియో కాన్ఫరెన్సులతో భయంధోలనని మరింత ఎక్కువ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చూస్తుంటే బార్డర్ల వద్ద సైనిక వర్గాలను, దళాలను సిద్ధం చేస్తున్న వీడియోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది..? నిజంగానే భారత్ చైనాల మధ్య యుద్ధం నెలకొనే పరిస్థితులు పుష్కలంగా కనపడుతున్నాయా..? లేక అంతర్జాతీయ మీడియా చేస్తున్న ప్రాపగండా వల్లా ఇలాంటి వార్తలతో మరింత ఉద్రిక్త పరిస్తుతులు నెలకొంటున్నాయా..?

 

అసలు సమస్య ఎక్కడ వచ్చింది :-

తెల్ల దొరల పాలనలో భారత్ చైనా దేశాలు మెక్ మోహన్ లైన్ అనే బార్డర్ తో విడదీయబడ్డాయి.. కాలం మారుతున్నప్పటికీ ఆ బార్డర్ ని ఇరు దేశ ప్రధానులు అసమ్మతంగానే భావిస్తున్నారు.. భారత్ లోని కొన్ని ప్రాంతాలు మావి అని చైనా లేదు ఆ ప్రాంతాలు మావే అంటూ భారత్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటు ఉన్నారు. అంతేకాక ఎన్నో సార్లు ఆ బార్డర్ ని దాటే ప్రయత్నాలు జరుపుతూనే ఉన్నాయి. ఈ సమస్య దశాబ్దాలు వెనక నుండి కోయినసాగుతూనే ఉంది, దేశ ప్రధానులు ఎన్నో మార్లు కలుసకున్నప్పటికీ ఎన్నో చర్చలు జరిపినప్పటికీ ఈ సమస్య పై ఓ సరైన పరిష్కారం దొరకలేదు. దాంతో అనుక్షణం ఇరు దేశాల బార్డర్లలో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్తుతులే కనపడుతాయి. ఇక భారత్ చైనాల మధ్య ఎప్పుడు సాన్నిహిత్యం దెబ్బతింటుందో అప్పుడు ఆ అల్లర్లు మరింత ఎక్కువగా కనపడతాయి.. ప్రస్తుతం కూడా సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే మళ్ళీ ఈ గొడవలకు తావు దొరికినట్టైంది. చైనాను ప్రపంచ అగ్ర దేశాలు అన్నీ కరోనా విషయంలో నిలదీస్తున్న పరిస్థితి.. ప్రపంచ ఆరోగ్య కేంద్రానికి చైనా పై విచారణ జరపాలని అనేక దేశాలు విన్నవించాయి, భారత్ కూడా చైనా పై విచారణ జరపాలని కొరడంతో మరోసారి ఈ అల్లర్లకు తావు దొరికింది. అప్పటినుండి ప్రతి రోజు సరిహద్దుల్లో అంధోలన పరిస్థితులు నెలకొంటున్నాయి. చైనా ప్రధాని రాత్రికి రాత్రి చైనా మిలిటరీ దళాలతో చర్చలు జరిపి యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని తెలియజేయడంతో యుద్ధ వాతావరణం నెలకొంది. మోడీ కూడా త్రివిధ దళాలతో చర్చలు జరిపారు..

 

యుద్ధం జరగబోతుందా..? :-

ఇక పోతే శనివారం ఇరు దేశ మిలిటరీ చీఫ్ లు సరిహద్ధు వద్ద కలవడం జరిగింది. యుద్ధపరిస్తితి రాకుండా శాంతియుతంగా సమస్యని పరిష్కారించాలని ఇరు దేశాల మధ్య మరలా శాంతిని నెలకొల్పాలని చర్చకు హాజరు అయ్యారు. చర్చల్లో భారత్ కొన్ని ఆంక్షలు తెలియజేయగా చైనా కూడా కొన్ని ఆంక్షలు తెలియజేసింది.. సరిహద్దుల్లో ఎలాంటి నిర్మాణాలు జరగకుండా చూసుకోవాలని ఇరు దేశాలు ఒప్పందాలు తీసుకొని సమావేశాన్ని విజయవంతంగా ముగించారు. ఇది ఇలా ఉండగా సమావేశానికి ముందు చైనా మీడియా నుండి విడుదల అయిన వీడియొ ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేసింది. ఆ వీడియోలో చైనా మిలిటరీ అంతా యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టు కనిపించడంతో సోషల్ మీడియలో ఈ విషయం వైరల్ అయ్యింది. పైగా సమావేశం తరువాత హోమ్ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాక్యాలు కూడా ప్రజల్లో టెన్షన్ ని పెంచాయి.. ప్రపంచం లోని పవర్ఫుల్ మిలిటరీ ఉన్న దేశ జాబితాల లిస్ట్ లో భారత్ ని మోడి చేర్చరాని అమిత్ షా పేర్కొన్నారు. మేము ఏ దేశ గౌరవాన్ని ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీయబోమని కానీ మన దేశానికి ఎదురుపడితే, గౌరవాన్ని దెబ్బ తీస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. ఇక అంతర్జాతీయ మీడియాలో ఇరు దేశాల మధ్య సరి సంబంధాలు కనబడటంలేదని, చర్చలు సరిగ్గా జరగలేదని వార్తలు వినిపించాయి, కానీ వాస్తవానికి అదంతా కేవలం మీడియా సృష్టించిన ప్రాపగాండా తప్ప మరోకటి కాదు.. ఇరు దేశాల మధ్య సంబంధాలు సరిగ్గానే ఉన్నాయని ఫారన్ అఫైర్స్ శాఖ తెలియజేస్తుంది. యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా ఎలాంటి సంకేతాలు లేవని ఆ శాఖ స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: