యువరత్న నందమూరి బాలకృష్ణ తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు వారసత్వాన్ని అందిపుచ్చుకుని అటు సినిమాల్లో స్టార్ హీరోగా రాణించడంతో పాటు ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు. ఎన్టీ రామారావు గతంలో చిత్తూరు జిల్లా మదనపల్లి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తన రాజకీయ వారసుడు నందమూరి బాలకృష్ణ అని ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ ఆ మాటను వెనక్కి తీసుకున్నారు. దీని వెనక చంద్రబాబు ఎన్టీఆర్ పై బలమైన ఒత్తిడి తెచ్చి ఆ మాటను ఉపసంహరించుకునేలా చేశారన్న చర్చలు కూడా రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.

 

ఇక తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని బాలయ్య 2014 ఎన్నికల్లో తొలిసారిగా తన తండ్రికి అత్యంత ప్రీతిపాత్రమైన నియోజకవర్గం అయిన హిందూపురం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన బాలయ్య ఐదేళ్లలో నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశారు. హిందూపురంలో మల్టీ స్పెషాలిటీ స్థాయిలో హాస్పిటల్ తో పాటు తన తండ్రి ఎన్టీఆర్ చిరకాల స్వప్నం అయిన హంద్రీ నీవా పనులు కూడా కంప్లీట్ చేసి హిందూపురానికి తాగునీటి కొరత తీర్చడంలో తనవంతు కృషి చేశారు. ఇక ఐదేళ్ల‌లో హిందూపురంలో కోట్లాది రూపాయ‌ల‌తో అభివృద్ధి జ‌రిగింది.

 

అందుకే గత ఏడాది ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. హిందూపురంలో మాత్రం బాలయ్య 2014 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే మరింత ఎక్కువ మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఏదేమైనా తన తండ్రి ఎన్టీఆర్‌కు, అన్న హ‌రికృష్ణ‌కు హిందూపురంలో ఎలాంటి ప్రేమానురాగాలు చూపించారో... ఇప్పుడు బాలయ్య కూడా వరుసగా రెండోసారి గెలిచి హిందూపురం నందమూరి పురం అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. 

 

ఈ క్రమంలోనే హిందూపురంలో ఇప్పట్లో విపక్షాలకు బాలయ్యను ఢీ కొట్టేంత సత్తా లేదని ప్రూవ్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే హిందూపురం ఓ అరుదైన రికార్డు కూడా న‌మోదు చేసింది. ఓకే కుటుంబం నుంచి తండ్రి ఎన్టీఆర్‌, ఆ త‌ర్వాత కుమారులు హ‌రికృష్ణ‌, బాల‌కృష్ణ ఇద్ద‌రిని కూడా అసెంబ్లీకి పంపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: