చిన్న చిన్న విషయాల్లో ఏపీ సీఎం జగన్ ని తక్కువ అంచనా వేసి విపక్ష తెలుగుదేశం పార్టీ ముందు నుంచి నష్టపోతూ వస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా చంద్రబాబు బలంగా ఉన్న సమయంలో కూడా జగన్ ని చాలా విషయాల్లో తక్కువ అంచనా వేసి దెబ్బ తిన్నారు. చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా పూర్తిగా భూస్థాపితం చేయాల‌ని ప్లాన్ వేశారు. అందుకే వైసీపీ నుంచి గెలిచిన 67 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 23 మందిని బ‌ల‌వంతంగా త‌మ పార్టీలోకి లాగేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే అస‌లు 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు బ‌ల‌మైన అభ్య‌ర్థులు కూడా ఉండ‌ర‌ని టీడీపీ ప్ర‌చారం చేసింది.

 

 

ఇక ఇప్పుడు బిజెపి వంతు వచ్చింది. కేంద్రంలో రాష్ట్రంలో వైసీపీకి.. బిజెపికి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. కేంద్రం ఏమీ అనే పరిస్థితి కూడా లేదు. అయితే రాష్ట్రంలో బిజెపి నేతలు కొందరు కొందరి అండ చూసుకుని కాస్త రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారు అనే విషయం అర్ధమవుతోంది. ఈ విషయంలో చాలా వరకు జగన్ ని బిజెపి తక్కువ అంచనా వేసింది. ఇప్పుడు వైసీపీ అధిష్టానం వారి అందరి మీద ఫోకస్ చేసింది. ఎవరు అయితే ఎవరిని ఎక్కడ ఎక్కడ కలిశారు.. ఎవ‌రి డైరెక్ష‌న్‌లో న‌డుస్తున్నారు అనే పక్కా సమాచారాన్ని ఒక రాజ్యసభ ఎంపీ ద్వారా బిజెపి అధిష్టానానికి వైసీపీ ఇచ్చింది. 

 

 

ఇక ఎవరితో ఎవరికి వ్యాపారాలు ఉన్నాయి. ఎవరితో ఎవరికి ఏ విధంగా సంబంధాలు ఉన్నాయి అనే దాని మీద పూర్తి సమాచారం ఇచ్చింది. దీనిపై ఇప్పుడు బిజెపి అధిష్టానం సీరియస్ గా ఉంద‌ని స‌మాచారం. గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా కొంద‌రు కీల‌క నేత‌లు ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే న‌డ‌వ‌డంతోనే మోదీ, షా వారికి షాకులు ఇచ్చారు. ఆ కోట‌రీని మొత్తం త‌ప్పించేశారు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో బిజెపి నాయకులను కొందరిని తప్పించే ఆలోచనలో ఉంది బిజెపి అధిష్టానం. ఇప్పటికే ఈ విషయాన్ని జెపి నడ్డా రాష్ట్ర పార్టీ నేతలకు చెప్పారు అని సమాచారం. దీనిని బ‌ట్టి చూస్తే త్వ‌ర‌లోనే ఏపీ బీజేపీలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకోనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: