2019 లో ఘోర ఓటమి చెందినదానికన్న.. ఆ తర్వాత జరుగుతున్న పరిణామలే టీడీపీని కొలుకోకుండా చేస్తున్నాయి. సొంత నేతలె చంద్రబాబును దెబ్బ మీద దెబ్బ కొడుతూ.. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడారు. పార్టీని వీడిన అనంతరం చంద్రబాబుపై అందరూ నిప్పులు చెరిగిన వాళ్ళే.  మరి కొంతమంది ఐతే పార్టీలో ఉన్నారా..? లేదా..? అనేల వ్యవహరిస్తున్నారు. ఏమీ పట్టనట్టు ఉంటున్నారు. అలాగే ఇంకొంతమంది పక్క పార్టీల వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్దంగా ఉన్నారని, టీడీపీని వీడిన ఎమ్మెల్యేల మాట. అయితే అనూహ్యంగా ఇప్పుడు మరో ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. దీంతో చంద్రబాబుకి మరింత డ్యామేజ్ జరగబోతుందని, ఆ షాక్ నుంచి ఇప్పట్లో బాబు కొలుకోలేరని తెలుస్తుంది. అదేంటంటే..

 

ఆ పార్టీకి చెందిన గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారట. పార్టీలోని కొందరు వ్యక్తులు ఆయన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. లోకేష్ అండతో కొందరు నేతలు గల్లాను గుంటూరు జిల్లాలో పక్కన పెట్టారు అనే ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి. అగ్రనేతలు సైతం ఇలానే ప్రవర్తిస్తుండడంతో గల్లా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు సమాచారం. పైగా చంద్రబాబు ఏపీ అధ్యక్ష బాధ్యతలు లోకేశ్ కి అప్పగిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఇదే గనుక జరిగితే ఏపీలో టీడీపీ భూస్థాపితం ఖాయమని, దీంతో తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని భావించిన గల్లా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే టీడీపీ వీడిన అనంతరం గల్లా ఏ పార్టీలో చేరుతారు అనేది సస్పెన్స్ గా మారింది. వైసీపీలో గనుక చేరితే తన క్యాడర్ తో సమస్యలు తేలెత్తే అవకాశం ఉందని తెలుస్తుంది. పైగా సీఎం జగన్ పరిపాలన మీద కూడా గల్లా అంత సంతృప్తిగా లేరని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో బీజేపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. పైగా గల్లాకి కేంద్రంలోని పెద్దలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో బీజేపీలో చేరితే తనకు అన్నీ రకాలుగా కలిసి వస్తుందని గల్లా భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: