ఎవరైనా తండ్రి స్ధాయికి చేరుకోవాలని, తండ్రి లాగ ఉన్నతస్ధాయిలో ఉండాలని కొడుకులు అనుకోవటం సహజం. కానీ విచిత్రంగా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు మాత్రం రివర్సులో కొడుకు నారా లోకేష్ స్ధాయికి దిగజారిపోయాడు.  ప్రత్యక్ష రాజకీయాల్లోకి లోకేష్ ప్రవేశించి చాలా సంవత్సరాలే అయినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన మాట వాస్తవం. చివరకు సొంతపార్టీ నేతల్లో కూడా చాలామంది లోకేష్ ను లైటుగానే తీసుకుంటున్నారు.

 

ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి 2014-19 మధ్య లోకేష్ పెద్ద మేధావిగా చెలామణి అయిపోయాడు. అలాంటి బాలమేధవి గురించి చంద్రబాబుకు బాగా తెలుసు కాబట్టే ఎంఎల్ఏగా కాకుండా దొడ్డిదోవన ఎంఎల్సీని చేసి మంత్రివర్గంలోకి తీసుకున్నాడు. దాంతో చినబాబు సామర్ధ్యంపై అందరిలోను బలమైన నమ్మకం ఏర్పడిపోయింది. ఈ నేపధ్యంలోనే మొన్నటి ఎన్నికల్లో టిడిపికి ఎదురైన ఘోర ఓటమి అందరికీ తెలిసిందే.  పార్టీ ఘోర ఓటమికి లోకేష్ ప్రధాన కారణమంటూ కొందరు నేతలు బహిరంగంగా ఆరోపణలు చేసి రాజీనామా కూడా చేసేశారు.

 

ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుండి లోకేష్ మీడియాతో మాట్లాడటం కన్నా ట్విట్టర్ వేదికకే ఎక్కువగా పరిమితమైపోయాడు. ఎందుకంటే ఏమి మాట్లాడుతాడో తనకే తెలీదు. ఏమి మాట్లాడాలో కూడా తెలీదు. అధికారంలో ఉన్నపుడు ఒకటి మాట్లాడబోయి మరోటి మాట్లాడటంతో పార్టీ ఎన్నిసార్లు నవ్వులపాలైందో అందరికీ తెలిసిందే. అందుకని గడచిన ఏడాదిగా లోకేష్ ట్విట్టర్ కే పరిమితమైపోయాడు. ఇపుడు చంద్రబాబు కూడా కొడుకు బాటలోనే నడుస్తున్నాడు. లోకేష్  ట్విట్టర్ కే పరిమితమయ్యాడంటే అర్ధం చేసుకోవచ్చు. మరి చంద్రబాబు కూడా ట్విట్టర్ ను ఎందుకు వదలటం లేదు ?

 

ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద తాను చేస్తున్న ఆరోపణలు, విమర్శలన్నీ కేవలం అక్కసుతోనే చేస్తున్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసు. జగన్ సిఎంగా దూసుకుపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్న చంద్రబాబు కేవలం అసూయతోనే నానా యాగీ చేస్తున్నాడు. సరే తాను ఏమి మాట్లాడినా అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ఎల్లోమీడియా ఉంది కాబట్టి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తన కసి తీర్చుకుంటున్నాడు. ఇటువంటి ఆరోపణలు, విమర్శలను జనాలు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. ఇదే సమయంలో చంద్రబాబుకు కరోనా వైరస్ కూడా బాగా కలిసివచ్చింది.

 

లాక్ డౌన్ కన్నా ముందే వీకెండ్ లో భాగంగా హైదరాబాద్ కు చేరుకున్న చంద్రబాబు, చినబాబులకు ప్రధానమంత్రి నరేంద్రమోడి మార్చి 22వ తేదీన ప్రకటించిన జనాతా కర్ఫ్యూ భలే కలసివచ్చింది. తర్వాత రెండు రోజులకే లాక్ డౌన్ ప్రకటన చేశాడు. ఇక అక్కడి నుండి చినబాబు లాగే చంద్రబాబు కూడా మ్యాగ్జిమమ్ ట్విట్టర్ కే పరిమితమైపోయాడు. రోజుకు నాలుగైదు ఆరోపణలు, విమర్శలు చేస్తు వాటినే ఎల్లోమీడియాలో ప్రచారం చేయించుకుంటూ  హ్యాపీగా కాలం గడిపేస్తున్నాడు. మొత్తానికి చంద్రబాబు కొడుకు స్దాయికి దిగజారిపోయాడన్నది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: