దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తీవ్రతరమవుతోంది. ఈ నేపథ్యంలో మార్చి 24 వ తేదీన లాక్ డౌన్ నిబంధనలు విధిస్తూ కేంద్రం కఠినమైన ఆంక్షలు విధించింది. ఎవరూ రోడ్లపైకి రాకుండా చేసింది. ఇక కరోనా వైరస్ గురించి ప్రజల్లో అవగాహన ఉండడంతో ఎవరికి వారు ముందు జాగ్రత్తగా ప్రభుత్వం ప్రభుత్వం చెప్పిన విధంగా ఇళ్లకే పరిమితమైపోయారు. ఆ విధంగా దాదాపు రెండు నెలల పాటు లాక్ డౌన్ నడిచింది. మూడో విడత లాక్ డౌన్ దగ్గర నుంచి కొన్ని సడలింపులు ఇస్తూ కేంద్రం వచ్చింది. అప్పటికే జనాలంతా ఇళ్లకే పరిమితం అయిపోవడం, వర్తక, వాణిజ్య, వ్యాపారాలు మొత్తం ఎక్కడికక్కడ  స్థంబించిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో కొన్ని షరతులతో కేంద్రం నిబంధనలను సడలించింది. ప్రస్తుతం పూర్తిగా గేట్లు ఎత్తకపోయినా ఎత్తినట్టుగానే పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. 

IHG


ఎందుకంటే అలా చేయకపోతే దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుంది అనేది కేంద్రం అంచనా. దీంతో అన్ని కార్యకలాపాలు యధావిధిగా నడుస్తున్నాయి. ఇంత వరకు బాగానే ఉన్నా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. నిత్యం పెరుగుతున్న కొత్త కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పరిస్థితి పూర్తిగా చేయి దాటి పోయింది. ఇక ఈ సమయంలో మరికొన్ని నిబంధనలు రూపొందించి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాల్సిన కేంద్రం ఇప్పుడు వాటిని పెద్ద సీరియస్ గా తీసుకున్నట్టుగా కనిపించకపోవడం పై ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది.

IHG

 ఎందుకంటే గతంతో పోలిస్తే కరోనా కేసులు ఇప్పుడు ఎక్కడికక్కడ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ప్రార్ధనా మందిరాలు తెరిచేందుకు, దైవ దర్శనాల పేరిట సామూహికంగా జనం గుంపులుగా రోడ్లపైకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. మత సందర్శనకు పూర్తిగా అనుమతి ఇవ్వడంతో కేంద్రం తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అసలు మత ప్రార్థనలు, సందర్శనా స్థలాలు అంటే జనం గుంపులుగా గుమాగూడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు, షరతులతో అనుమతులు ఇచ్చినా, దీన్ని నియంత్రించడం సాధ్యం కానీ పని. అలాగే కొన్ని మతాలలో సామూహిక ప్రార్థనలు చేయడం ఆనవాయితీ. 

 

కేంద్రం పూర్తిగా సడలింపు ఇచ్చేసి ఇప్పుడు షరతులు వర్తిస్తాయి అనే టాగ్ లైన్ పెట్టినా పట్టించుకునేవారు ఎవరూ ఉండరు. పోనీ దేశంలో కరోనా కంట్రోల్ అయ్యే పరిస్థితి వచ్చిందా అంటే అదీ లేదు. లాక్ డౌన్ సమయంలో జనాలు ఉపాధి లేక, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడంతో, వర్తక, వాణిజ్య, వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని, అలాగే రవాణాను పునరుద్ధరించాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. ఎందుకంటే అది ఎన్నిరకాలుగా చూసినా అది అత్యవసరం. కానీ ప్రార్థన మందిరాలు, జనాలు గుంపులుగా తిరిగే సంస్థల కార్యకలాపాలు మళ్లీ పునప్రారంభిస్తూ నిర్ణయం తీసుకోవడం కాస్త ఆలోచించాల్సిన విషయమే.


 ప్రార్ధనా మందిరాలు తెరవాలని ఎవరు, ఎక్కడా పెద్దగా డిమాండ్ చేయలేదు. అయినా కేంద్రం ఎందుకు ఈ విషయంలో తొందర పడినట్లు అనేదే ఎవరికీ తెలియడంలేదు. ఈ విషయంలో కేంద్రం రాష్ట్రాలదే అధికారం అని చెప్పినా ... ఎలాగూ కేంద్రం అనుమతి ఇచ్చేసిందిగా అనే ధోరణితో అన్ని రాష్ట్రాలు దీనికి ఒకే చెప్పేసాయి.  మొదట్లో కంటే ఇప్పుడు కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సమయంలో కేంద్రం ఆ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా... ఈ విధంగా గుళ్ళు, మత ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడంపై అనేక విమర్శలకు తావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: