ఒక్క‌టి మాత్రం నిజం తెలుగు రాజ‌కీయాల్లో సినిమా వాళ్లు ముందు నుంచి తెలుగుదేశం పార్టీకే ఎక్కువుగా స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ కావ‌డంతో సినిమా రంగంలో చాలా మంది ఆ పార్టీకే జై కొడుతూ వ‌చ్చారు. అయితే కృష్ణ‌, కృష్ణంరాజు లాంటి కొంద‌రు మాత్రం ఎన్టీఆర్‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్‌తో పాటు బీజేపీ లాంటి పార్టీల‌కు సపోర్ట్ చేస్తూ వ‌చ్చారు. ఇక దాస‌రి నారాయ‌ణ రావు సైతం ఎన్టీఆర్‌కు వ్య‌తిరేకంగా ముందు నుంచి కాంగ్రెస్ రాజ‌కీయాలే చేసుకుంటూ వ‌చ్చారు. 

 

ఆ త‌ర్వాత 2004 ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్‌కు, వైఎస్ కు ప్ర‌చారం చేసేందుకు క‌నీసం ఐదారుగురు సినిమా వాళ్లు కూడా లేని పరిస్థితి. మ‌ళ్లీ వైఎస్ సీఎం అయ్యాక వీళ్లు అంద‌రూ త‌మ ప‌నుల కోసం ఆయ‌న‌కు ద‌గ్గ‌ర‌య్యారు. అయితే కొంద‌రు చిన్నా చిత‌కా న‌టులు మాత్రం ముందు నుంచి వైఎస్‌నే న‌మ్ముకుని ఉన్నారు. ఇక తెలంగాణ‌లో కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక ఏపీలో ఎలా ఉన్నా అక్క‌డ మాత్రం ఇండ‌స్ట్రీ అంతా కేసీఆర్‌కు జై కొట్ట‌క త‌ప్ప‌లేదు. ఇక కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వ‌చ్చేముందు సినిమా వాళ్లంతా జై కేసీఆర్ జైజై కేసీఆర్ అని నినందించారు.

 

ఇక ఏపీకి వ‌స్తే జ‌గ‌న్ సీఎం అయ్యాక కూడా క‌లిసేందుకు టీడీపీ సానుభూతి ప‌రులు అయిన ఇండ‌స్ట్రీ పెద్ద‌లు క‌నీసం శుభాకాంక్ష‌లు చెప్ప‌లేదు క‌దా.. ఆయ‌న్ను క‌లిసేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌లేదు. ఇక ఇప్పుడు పేరుకు క‌రోనా బూచీ చూపించినా వాళ్లంతా త‌మ స్వ‌లాభాల కోస‌మే అమ‌రావ‌తి వెళ్లి జ‌గ‌న్‌ను క‌లిసిన‌ట్టే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.  ఇక వీళ్లు చెప్పిందంతా విని ఊ కొట్ట‌డానికి జ‌గ‌న్ ఏమ‌న్నా వీళ్ల గురించి తెలియ‌ని వాడు కాదుగా..?  వీళ్లు జ‌గ‌న్‌ను క‌లిసి ర‌క‌ర‌కాల విన‌తులు ముందు పెట్టార‌ట‌. తెలంగాణ ఇప్పుడే షూటింగ్‌ల‌కు ఓకే చెప్పినా అక్క‌డ ఏపీ ప్ర‌భుత్వం మాత్రం జూలై 15 వ‌ర‌కు ప‌ర్మిష‌న్ లేద‌ని చెప్పేసింది.

 

సినిమా థియేటర్లకు ఫిక్స్‌డ్ కరెంటు చార్జీలు తీసెయ్యడం, నంది అవార్డ్స్ ఫంక్షన్లు, విశాఖలో స్టూడియోలకు స్థలాలు, ఇళ్ల స్థలాలు అని ఏవేవో గొంతెమ్మ కోరిక‌లు కోరినా జ‌గ‌న్ మౌనంగానే చూద్దాం అని చెప్ప‌డంతో ఆయ‌న్ను క‌లిసేందుకు వెళ్లిన పెద్ద‌ల మొఖాలు వాడిపోయాయ‌ని టాక్‌..?  ఏపీలో షూటింగ్ జ‌రుపుకునే సినిమాలు త‌క్కువే క‌దా..!  ఇక ఇప్ప‌ట్లో  అక్క‌డ ప్ర‌భుత్వ స్థ‌లాలు వ‌స్తేనే పెట్టుబ‌డులు పెడ‌దాంలే అనుకుంటున్నార‌ట‌. హైద‌రాబాద్ మాకు చాలా కంప‌ర్ట్‌బుల్‌.. మ‌ర్యాద పూర్వ‌కంగానే జ‌గ‌న్‌ను క‌లిసేందుకు వెళ్లామ‌ని స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నార‌ట‌. అది వీరి డ‌బుల్ గేమ్‌..?

మరింత సమాచారం తెలుసుకోండి: