రాజకీయాలు హద్దులు దాటి పోతున్నాయి. నీచపు రాజకీయాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయి. విలువలను మరిచి , హద్దులు దాటి టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు,   ప్రతి విమర్శలు సహజం. కానీ..ఆ విమర్శలు , ప్రతి విమర్శలు ప్రజాస్వామ్య సూత్రాలకు లోబడి, కట్టుబడి  ఉండాలి. విమర్శలు, ప్రతి విమర్శలు ప్రజాస్వామ్య విధానాలపై నమ్మకాన్ని కలిగించే విధంగా ఉండాలి. కానీ..దురదృష్టం. ప్రజాస్వామ్య సూత్రాలు కూడా తల దించుకునే విధంగా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి చంద్రబాబు సహా టీడీపీ నేతలు ఓర్చుకోలేక పోతున్నారు. ఏదో విధంగా బురద జల్లుతున్నారు. పచ్చ మీడియాను అడ్డు పెట్టుకుని అబద్దపు రాతలు రాయిస్తున్నారు. ఎన్ని రకాలుగా వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిపై బురద జల్లాలో అన్నీ రకాలుగా బురద జల్లుతున్నారు. టీడీపీ శ్రేణులను చంద్రబాబు ఎంత రెచ్చగొట్టినా, ఎల్లో మీడియా ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా..సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం తొణకడం లేదు, బెణకడం లేదు. ఆయన ఆలోచనలు గ్రౌండ్ లెవల్లో అమలు చేసుకుంటూ వెళ్తున్నారు.

 

చంద్రబాబు నాయుడు తన 14 ఏళ్ల సీఎంగా చేయనది ..వైఎస్‌ జగన్‌ ఏడాదిలోనే చేసి చూపించారని సామాన్యులు చెబుతున్నారు. ఇదే ఎల్లో గ్యాంగ్‌కు అంతుపట్టకుండా పోయింది.  ఎల్లో న్యూస్‌ పేపర్స్‌, ఎల్లో ఛానళ్లు, ఎల్లో యూ ట్యూబ్, వెబ్ సైట్లు ఏక కాలంలో దాడి చేస్తున్నా వైఎస్‌ జగన్‌ మాత్రం చిరు నవ్వుతో తన పనులు తాను చేసుకుపోతున్నారు. అందుకే..ఆయన సతీమణి వైఎస్‌ భారతీ రెడ్డిని టార్గెట్ చేసింది ఎల్లో గ్యాంగ్. భారతీ ఇసుక అంటూ టీడీపీ నేతలు చేస్తున్న ట్రోల్స్‌ చూస్తుంటే ప్రజాస్వామ్యం  సిగ్గు పడుతుంది. రాజకీయాలు తల దించుకుంటున్నాయి. వైఎస్‌ జగన్‌  ఏడాది పాలనతోనే టీడీపీ దుకాణం మూసుకోవడానికి సిద్ధమైంది. ఇది  భరించలేకనే టీడీపీ నేతలు అనైతిక కామెంట్లకు తెగ బడుతున్నారు. ఈ రోజున వైఎస్‌ భారతీ రెడ్డి మీద టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్లు ఆ పార్టీని భూస్థాపితం చేయడం ఖాయమని వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: