ఏపీ సీఎం వైఎస్ జగన్ కు రాజకీయ శత్రువులు ఎవరు.. అంటే వచ్చే సమాధానం తెలుగు దేశం పార్టీ.. అంతకుమించిన పార్టీలు ఏపీలో ఇప్పుడు ఏమీ లేవు. మించిన పార్టీలు కాదు..కనీసం ఓ ఎమ్మెల్యే ఉన్న స్థాయి పార్టీలు కూడా లేవు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో రెండే రెండు పార్టీలకు ప్రాతినిథ్యం ఉంది. అయితే వైసీపీ.. లేకుంటే టీడీపీ.. అయితే ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరమైన పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

 

 

అయితే జగన్ పోరాడాల్సింది ఒక్క తెలుగు దేశం పార్టీతోనే కాదు.. పార్టీ అనుకూల మీడియాతో కూడా.. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఏకంగా ప్రమాణ స్వీకార వేదికపైనే చెప్పేశాడు. అందులోనూ బలమైన శత్రువులు.. ఆ రెండు పత్రికలు.. ఏపీలోని ప్రముఖ దినపత్రికలు మూడే.. అందులో రెండు తెలుగు దేశం కరపత్రికలుగా పేరున్నవే. మరొకటి సీఎం జగన్ కు చెందిందే.

 

 

అందుకే ఆ రెండు పత్రికలను దెబ్బతీయడానికి జగన్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. కానీ అది సాధ్యపడటం లేదు. కాగల కార్యము గంధర్వులే తీర్చారన్నట్టు.. ఇప్పుడు జగన్ కు కావలసిన పని కరోనా చేసేసింది. అదెలాగంటారా.. ఇప్పుడు తెలుగు నాట పత్రికలు కరోనా కారణంగా ఘోరమైన సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. అగ్రశ్రేణి పత్రిక తన సుదీర్ఘ కెరీర్లోనే ఎన్నడూ చవి చూడని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఎంతగా అంటే తన ఉనికినే కోల్పోతుందా అన్న దారుణమైన స్థితికి చేరుకుంది.

 

 

తెలుగు పత్రికారంగ చరిత్రలో అనేక ప్రయోగాలు చేసిన అగ్రశ్రేణి పత్రిక ఇప్పుడు క్రమంగా తన ప్రాభవం కోల్పోతోంది. ఆ రెండు పత్రికలు దెబ్బతింటే.. ఇదే సమయంలో ఖర్చుకు వెనుకాడకుండా ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు జగన్ సొంత పత్రిక ప్రయత్నిస్తోంది.అందుకే కోట్లకు కోట్లు నష్టం వచ్చినా సరే..జిల్లా టాబ్లాయిడ్లు కొనసాగిస్తోంది. ఇది రాజకీయంగా జగన్ కు చాలా కలిసొచ్చే అంశం అంటున్నారు మీడియా విశ్లేషకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: