ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ స్కామ్ లపై సిబిఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. చంద్రన్న కానుక పేరుతో భారీగా కొనుగోళ్లు చేశారట.. అందులో 150 కోట్ల స్కామ్ జరిగినట్లు మంత్రివర్గ ఉప సంఘం విచారణలో తేలిందట. అలాగే ఫైబర్ గ్రిడ్ విషయంలో వేమూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో పెద్ద కుంభకోణం జరిగిందట. టెర్రాసాఫ్ట్ సంస్థకు అక్రమంగా టెండర్ ఇచ్చారట. సెట్ ఆప్ బాక్స్ ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని తేలిందట.

 

 

ఇంతవరకు చంద్రబాబు నాయుడు దమ్ముంటే విచారణ వేయాలని సవాల్ చేశారని మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. బాగానే ఉంది.. సీబీఐ విచారణకు ఆదేశించారు. కానీ ఇలాంటి విచారణలు, కోర్టు కేసుల విషయంలో చంద్రబాబు మహా నేర్పరి అని చెబుతారు. సాధారణంగా చంద్రబాబు అసలు దర్యాప్తులు, విచారణలు జరగకుండా స్టే తెచ్చేసుకుంటాడు..ఇలా గతంలో చాలాసార్లు చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నారు కూడా. అసలు కోర్టు స్టే అంటేనే చంద్రబాబు గుర్తొస్తారని చాలా మంది సెటైర్లు కూడా వేస్తుంటారు.

 

 

అంతే కాదు.. చంద్రబాబు వ్యవస్థలను బాగా మేనేజ్ చేస్తాడని ఆరోపణలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు అక్రమాస్తులపై సీబీఐ విచారణ కోరితే.. అదే సీబీఐ అబ్బే మా దగ్గర సిబ్బంది లేరని సమాధానం ఇచ్చింది. అప్పుడు సీబీఐ జేడీగా జగన్ కేసుల విచారణతో హీరో అయిన లక్ష్మినారాయణే ఉన్నారు. అదే సీబీఐ జగన్ కేసు దర్యాప్తుకు బోలెడంత సిబ్బంది ఉంటారు. అదీ చంద్రబాబు మేనేజ్ మెంట్ స్థాయి.

 

 

మరి ఇప్పుడు కూడా చంద్రబాబు తన పూర్తి స్థాయి శక్తిసామర్థ్యాలు వినియోగిస్తారా లేదా.. దమ్ముంటే విచారణ చేసుకోండి అంటూ రొమ్ము విరిచి నిలబడతారా.. అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇదంతా కక్ష సాధింపు అనే కోణంలో చంద్రబాబు వెంటనే హైకోర్టుకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. చంద్రబాబుపై ఏదో ఒక కేసు పెట్టి జైల్లో పెట్టించాలన్న జగన్ లక్ష్యం నెరవేరుతుందా.. చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: