సీఎం జగన్ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారా..? లేక, చెప్పిన మాట మీద నించుంటున్నారా..? రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తే ఎవరికైనా ఇదే సందేహం వస్తుంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్ ప్రతిపక్ష నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారన్నది సత్యం. ఇంతకాలం రాజకీయంగా టీడీపీని అణగతొక్కేసే ప్రయత్నం చేసి దాదాపు సక్సెస్ అయిన సీఎం జగన్.. తాజాగా వారు చేసిన అవినీతిపై ఎంక్వైరీలు వేసి వారిని పూర్తిగా తొక్కేసే కార్యక్రమానికి తెరతీసారని అంటున్నారు. అవినీతికి ఏమాత్రం తావులేని పాలన అందిస్తానని చెప్పిన జగన్… గత ప్రభుత్వ హాయాంలో జరిగిన అవినీతిపై ఎంక్వైరీలు స్టార్ చేశారు.

 

చంద్రన్న కానుక పేరుచెప్పి చంద్రబాబుని, ఫైబర్ గ్రిడ్ పేరుచెప్పి లోకేష్ ని, ఈఎస్ఐ మందుల పేరుచెప్పి అచ్చెన్నల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఇలా వరుసగా చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడులను టార్గెట్ చేసిన అనంతరం… నెక్స్ట్ వరుసలో ఎవరు ఉన్నారు అనే విషయంలో ఒకపేరు ప్రముఖంగా వినిపిస్తుందట. ఆయన మరెవరో కాదు మాజీ మంత్రి దేవినేని ఉమ. ఎందుకంటే జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించడంతోపాటు, పోలవరం పేరుచెప్పి విపరీతమైన అవినీతికి పాల్పడ్డారని ఆయనమీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయట. దీంతో సీఎం జగన్ నెక్స్ట్ టార్గెట్ దేవినేని ఉమ అని తెలుస్తుంది. అది ఎంతవరకూ నిజం అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

 

ఈ క్రమంలో వరుసగా చాలా మంది టీడీపీ మంత్రులు వారు చేసిన పనులకు ప్రతిఫలాలు పొందే అవకాశాలున్నాయని అంటున్నారు. అలాగే సీఎం జగన్ ఎవరినీ కావాలని టార్గెట్ చేయట్లేదాని, గత ప్రభుత్వంలో చేసిన అవినీతిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైసీపీ వర్గాల మాట. అలాగే ఈ చర్యల నేపధ్యంలో ఇంకొంతమంది టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు సీఎం జగన్ కి జై కొట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో టాక్. మరి అలా జై కొట్టిన వారిలో అవినీతి పరులుంటే వారిపై చర్యలు తీసుకుంటారా..? అనే ఈ ప్రశ్నకి కాలమే సమాధానం చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: