వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడే నాయకుల్లో ఎప్పుడూ ముందుంటారు టిడిపి మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆయన మొదటి నుంచి దూకుడు స్వభావంతో ఉంటూనే వస్తుండడం, ఆయనతో అనేక చిక్కులు తెచ్చిపెట్టింది అనే చెప్పాలి. ఎందుకంటే ఆ దూకుడు స్వభావం కారణంగా ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్న ఆలోచన నుంచి చంద్రబాబు వెనక్కి తగ్గారనే ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతుంది. ఇక ఆయన వైసీపీ ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అదే పనిగా ప్రభుత్వ తీరును ఎండగడుతూ అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు. అసెంబ్లీలో చంద్రబాబు కంటే మించిన విధంగా ఆయన ప్రభుత్వంపైన, మంత్రులు, జగన్ పైన విమర్శలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా, పెద్ద గొంతుకగా మారారు. 

IHG


ఇక ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు కూడా అచ్చెన్నకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ, పార్టీలో ఆయన పరపతిని పెంచారు. కాకపోతే ఆయన గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో ఈఎస్ఐ వ్యవహారంలో భారీ కుంభకోణానికి పాల్పడినట్లుగా ఆరోపణలు చేయడమే కాదు, ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజిలెన్స్ విచారణ చేయించడంతో అనేక వాస్తవాలు బయటపడ్డాయి. ఆ కేసులోనే ఇప్పుడు అచ్చెన్న నాయుడు ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కాకపోతే ఇక్కడే వైసిపి టీడీపీ శ్రేణులకు గట్టి వార్నింగ్ తో కూడిన మెసేజ్ ఇస్తున్నట్టుగా అర్థం అవుతోంది. 

 

IHG


అకారణంగా తమపై ఎవరు గొంతు పెంచినా,  చివరకు ఊచలు లెక్క పెట్టాల్సిందే అన్న సంకేతాలు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. అసలే ఇప్పటికే పెద్ద ఎత్తున టిడిపి నాయకులను వైసీపీలో చేర్చుకుని ఆ పార్టీని బలహీనం చేయాలని చూస్తోంది. తాజాగా టీడీపీ మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు వైసిపి కండువా కప్పుకున్నారు. ఇంకా అనేక మంది టిడిపి ఎమ్మెల్యేలను ఆ పార్టీకి రాజీనామా చేయించి ప్రధాన ప్రతిపక్ష హోదా పోగొట్టాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పుడు పెద్ద పీట వేశారు. ఇక అచ్చెన్న నాయుడుతో పాటు ముగ్గురు నలుగురు అదేపనిగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ, ప్రజల్లో ప్రభుత్వంపై చులకన భావం ఏర్పడే విధంగా వ్యవహరిస్తున్న తీరుపై చాలాకాలంగా సీఎం జగన్ సీరియస్ గానే ఉన్నారు. 

 

IHG


కాకపోతే తమపై ఆరోపణలు చేస్తున్న వారు గతంలో భారీ ఎత్తున కుంభకోణాలకు, అవకతవకలకు పాల్పడ్డారనే ఆధారాలు జగన్ దగ్గర ఉన్నాయి. దానిని సాక్ష్యాధారాలతో సహా నిరూపించి వారు నోరెత్తకుండా చేయాలన్నది వైసీపీ ప్లాన్ గా కనిపిస్తోంది. ఇప్పుడు ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు అరెస్ట్ అవ్వడం జస్ట్ శాంపిల్ మాత్రమేనని, ఇంకా అనేక మంది నాయకులకు సంబంధించిన ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, ఏ క్షణమైనా, ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే సంకేతాలను ఇప్పుడు వైసిపి పంపించినట్టు గా కనిపిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన ఆందోళన నెలకొంది. ఇప్పటికే పార్టీ మారదామా వద్ద అనే ఆలోచనలో ఉన్న వారు సైతం కీలక నిర్ణయం వెంటనే తీసుకోవాలని, ఆలస్యం చేస్తే ఇబ్బందులు పడక తప్పదని, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీడీపీ కూడా తమను ఆదుకునే అవకాశం లేదని వారంతా ఒక అభిప్రాయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: