తెలుగుదేశంపార్టీ హయాంలో ఆకాశమంతగా రెచ్చిపోయిన అవినీతిపైనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికి ఇద్దరు సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, జేేసి ప్రభాకర్ రెడ్డిలను అరెస్టు చేసింది.  ట్రాన్స్ పోర్టు మాఫియా, మైనింగ్ మాఫియా, లిక్కర్, శాండ్, హెల్త్  మాఫియా తదితరాలపై ఇపుడు ప్రభుత్వం దాడులు చేస్తోంది. దీన్ని తట్టుకోలేకపోతున్న చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా టిడిపి నేతల ఆర్ధిక మూలాలపై దెబ్బ తీస్తున్నారంటూ గోల చేసేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరటంపై  చంద్రబాబు మాట్లాడుతూ శిద్దాను ఒత్తిడి పెట్టి పార్టీ మారేట్లు చేస్తున్నారంటూ సొల్లు ఆరోపణలు మొదలుపెట్టాడు.

 

నిజానికి టిడిపి ఎంఎల్ఏలు కానీ నేతలను కానీ వైసిపిలో చేర్చుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. పైగా టిడిపి నుండి ఎవరైనా చేరితే తలనొప్పులు కూడా మొదలయ్యే అవకాశాలున్నాయి. ఎవరైనా కోరి తలనొప్పులు తెచ్చుకుంటారా ? పైగా శిద్దా లాంటి వాళ్ళు టిడిపి హయాంలో ఉన్నపుడు విచ్చలవిడిగా చెలరేగిపోయిన విషయం అందరికీ తెలిసిందే.   అప్పట్లో ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని ఏ స్ధాయిలో అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారనేందుకు గుంటూరు జిల్లాలోని గురజాల మాజీ ఎంఎల్ఏ యరపతినేని శ్రీనివాసరావే ఉదాహరణ. గురజాల కంపెనీ ఐదేళ్ళల్లో సుమారు రూ. 400 కోట్లకు పైగా అక్రమ మైనింగ్ కు  పాల్పడినట్లు హై కోర్టు విచారణలో బయటపడింది. అయినా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కారణం ఏమిటంటే యరపతినేని టిడిపి ఎంఎల్ఏ కావటమే.

 

అలాగే అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి ఎన్ని అక్రమాలకు పాల్పడింది ఇపుడు ఆధారాలతో సహా బయపడుతోంది. మరి టిడిపి హయాంలో ఇవే అక్రమాలు జరిగినపుడు ఎందుకు అధికారులు పట్టించుకోలేదు ? ఎందుకంటే జేసి సోదరులు టిడిపిలో కీలక నేతలు కాబట్టే. వాళ్ళపై ఇపుడు చర్యలు తీసుకుంటుంటే టిడిపి నేతలపై వేధింపులంటూ చంద్రబాబు నానా గోల చేస్తున్నాడు. ట్రాన్స్ పోర్టులో పెద్ద మాఫియా నడుస్తోందంటూ స్వయంగా అప్పుడు, ఇప్పుడు కూడా టిడిపి ఎంపి అయిన కేశినేని నానినే ఆరోపణలు చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

 

అధికారంలో ఉన్నపుడు సొంత పార్టీ ఎంపినే అంత తీవ్రంగా ఆరోపణలు చేశాడంటే అప్పట్లో మాఫియా ఏ స్ధాయిలో రెచ్చిపోయిందో అర్ధమైపోతోంది. అటువంటి మాఫియాను నియంత్రించాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు వేధింపులుగా యాగీ చేస్తున్నాడు. ఇక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నారాయణరావు మాట్లాడుతూ విశాఖపట్నం నుండి విజయవాడ వరకూ చంద్రబాబు హయాంలో లిక్కర్ మాఫియా విపరీతంగా చెలరేగిపోయిందంటూ ఆరోపణలు చేశాడు. గాజువాక, అనకాపల్లి లాంటి చోట్ల పెరిగిపోయిన లిక్కర్ మాఫియాను, వేలాది బెల్ట్ షాపులను జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే నియంత్రించినట్లు కూడా నారాయణరావు చెప్పటం గమనార్హం.

 

అలాగే చంద్రబాబు హయాంలో రెచ్చిపోయిన మాఫియాలో మెడికల్ మాఫియా కూడా కీలకమైనదే అంటూ కాంగ్రెస్ అధికారప్రతినిధి చెప్పటం గమనార్హం. తన మద్దతుదారులకు, సామాజికవర్గంలోని వాళ్ళకే ఆసుపత్రుల మైనటెనెన్స్ కాంట్రాక్టులను ఏకపక్షంగా కట్టబెట్టినట్లు ఆరోపించాడు. అప్పట్లో కాంట్రాక్టులు తీసుకున్న వాళ్ళంతా వందల కోట్ల రూపాయలు దోచేసుకున్నాడని కూడా మండిపడ్డారు. అటువంటి మాఫియాను జగన్ ఒకేసారి దెబ్బ కొట్టడం ఆహ్వానించదగ్గ విషయమే అన్నాడు. చంద్రబాబు హయాంలో ఇసుక మాఫియా ఎలా రెచ్చిపోయిందో జనాలందరికీ తెలిసిందే అన్నారు. కాబట్టి ఇపుడు జరుగుతున్నది ఆర్ధిక మూలాలను దెబ్బ కొట్టడం కాదని కేవలం అవినీతి మూలాలను మాత్రమే నియంత్రిస్తున్నట్లు అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: