టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టుతో ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారికి ఉలిక్కిపడింది. ఆయన అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు టీడీపీ శ్రేణులు. అధినేత చంద్రబాబు నుంచి పార్టీ ఎమ్మెల్యేల వరకు అందరూ ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ కక్షపూరిత రాజకీయాలకు తెరతీస్తున్నారని మండిపడ్డారు. అయితే అనూహ్యంగా ఇప్పుడొక కొత్త కోణం బయటకి వచ్చింది. అదేంటంటే.. సీఎం జగన్ అసలు టార్గెట్ అచ్చెన్నాయుడో, చంద్రబాబో కాదట.. ఆయన అసలు టార్గెట్ ఎంపీ రామ్మోహన్ నాయుడట. అసలు కథ ఏంటంటే..

 

గత రెండు వారాలుగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను చూస్తే వైసీపీ నేతలు పూర్తిగా ఎర్రంనాయుడు కుటుంబంపై దృష్టి పెట్టినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు రామ్మోహన్ నాయుడిను ఏపీ టీడీపీ అధ్యక్షుడ్ని చేస్తున్నారని.. దాన్ని లోకేష్ వ్యతిరేకించాడని.. ఏదేదో జరుగుతోందని వైసీపీ సోషల్ మీడియా టీం ఒక వార్తను సర్క్యూలేట్ చేసింది. దాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ ద్వారా రామ్మోహన్ నాయుడుపై దాడి ప్రారంభించారు. అది అలా కొనసాగుతూనే ఉంది. దీన్ని బట్టి చూస్తే ఎర్రన్న కుటుంబాన్ని 2 వారాల క్రితమే టార్గెట్ చేసినట్టు అర్ధమవుతుంది.

 

ఈ నేపధ్యంలోనే నిన్న ఉదయం అచ్చెన్నాయుడిని అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే.. ఈఎస్‌ఐ స్కాంలో ఫార్మాలిటీగా రాసిన ఓ లేఖను ఆధారంగా చేసుకుని అవినీతికి పాల్పడ్డారని అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు. అవినీతికి పాల్పడటం అంటే… అక్రమ ఆస్తులు పోగేసుకుని దొరికిపోవడం. కానీ అచ్చెన్నాయుడు అలాంటి ఆస్తులు ఉన్నాయని ఏసీబీ చెప్పలేదు. అవినీతికి పాల్పడినట్లుగా ఆధారాలు కూడా చూపలేదు. ఈ పరిణామాలను చూసుకుంటే రామ్మోహన్ నాయుడిని దెబ్బతీసేందుకే అచ్చెన్నాయుడిని అరెస్టు చేసినట్టి టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అదేంటి అనుకుంటున్నారా..

 

అతి చిన్న వయసులో ఉన్న రామ్మోహన్ నాయుడు..తన తండ్రి మృతితో అకస్మాత్తుగా రాజకీయాల్లోకి వచ్చారు. అయితేనేం చాలా త్వరగా విషయ పరిజ్ఞానాన్ని పొందారు. ఏ అంశంపైనైనా అనర్ఘళంగా మాట్లాడగల సామర్థ్యం తెచ్చుకున్నారు. ఇలాంటి రామ్మోహన్ నాయుడు గనుక భవిష్యత్ నేత అయితే.. తమకు గడ్డు పరిస్థితి ఎదురవుతుంది.. అందుకే వైసీపీ సర్కార్ ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసి.. మానసికంగా ఇబ్బంది పెట్టే లక్ష్యంతోనే ఈ తరహా ప్రయత్నాలు చేస్తోందని రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తున్న చర్చ. మరి వైసీపీ అనుకుంటున్న లక్ష్యం నెరవేరుతుందా.. లేక రామ్మోహన్ నాయుడు దీనికి ధీటుగా ఏదైనా వ్యూహం రచిస్తారా అనే విషయం కాల క్రమేణా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: