నాన్నంత‌టి నాన్న అని మురిసిపోతాడు తార‌క రాముడు
నాలో అభిమానిని త‌ట్టిలేపింది ఆయ‌నే అని చెప్పిపోతాడు క‌ల్యాణ రాముడు ఈ పండ‌గ ఏమిచ్చింది స‌ర్..నేను బాగా పాడానో లేదో కానీ ఒక ప్ర‌య‌త్నం చేశాను అంటూ న‌వ్వుతారు బాల‌య్య‌.. ఇదీ ఇవాళ్టి అరవైల‌లో బాల‌య్య.

 

బ‌స‌వ తార‌కం క్యాన్స‌ర్ ఆస్ప‌త్రి పిల్ల‌ల‌ను ప‌ల‌క‌రించి వ‌చ్చాడు. త‌న ఆత్మీయుల‌కు వంద‌నాలు చెల్లించాడు. అమ్మ‌నాన్న‌ల స్మ‌ర‌ణ తో కొత్త వ‌సంతం ఆరంభించాడు..ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ అదే ఉత్సాహంలో ఉండాలి మీరు అని అన్నాడు చిరు. త‌న వారికీ త‌న‌ను న‌మ్ముకున్న వారికీ అంద‌రికీ శుభాకాంక్ష‌లు చెబుతూ బాల‌య్య మ‌రో వ‌సంతాన్ని ఆరంభించాడు.

 

కొత్త సినిమా క‌బుర్లు చెప్పాడు బాల‌య్య
బోయపాటి తో మ‌ళ్లీ సినిమా
ఈ సారి డైలాగ్ పై పెద్ద దుమారం రేగింది
బాల‌య్య న‌వ్వాడు బోయ‌పాటి ఆలోచ‌న‌లో పడ్డాడు
అయినా ఆవేశంతో చెప్పినా కొంత అర్థం చెడింది క‌దా! అన్న‌ది అంద‌రి అభిప్రాయం

 

త‌ప్పు ఎందుకు ఎదుటివారిని త‌ప్పు ప‌డుతూనే త‌ప్పులు ప‌ల‌క‌డం త‌ప్పు ఇది దిద్దుకుంటే ఈ బీబీ3 ఆయ‌న‌కో ఆనందాన్ని ఇస్తుంది. మామూలుగా క‌థ వ‌ర‌కూ ఆయ‌న‌ను ఎలా ఒప్పిస్తారో ఇప్ప‌టికీ ఆశ్చ‌ర్య‌మే.. న‌వ్వుకుంటాను ఈ సినిమాను ఆయ‌నెలా ఓకే చేశారో అని..! ఈ సారి బోయ‌పాటి ఏంచెప్పాడో మ‌రి! కాస్త సుమోలు గాల్లో లేవ‌కుండా చేయండి/నాలుగు బూతులు ఏలుబ‌డి చేయ‌కుండా డైలాగులు రాయండి చాలు బాల‌య్య సినిమా త‌ప్ప‌క హిట్ /ఇప్ప‌టికింతే! ఎన్న‌డూ నాన్న‌ను స్మ‌రించే బాల‌య్య కు మ‌రిన్ని ఆనందాలు వ‌రించాల‌న్న‌ది అంద‌రి కోరిక.. నెరవేరాల‌ని ఆశిస్తూ..

 

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి 


పోస్ట‌ర్ డిజైన‌ర్  : గిరిధ‌ర్ అర‌స‌వ‌ల్లి

 

మరింత సమాచారం తెలుసుకోండి: