ఉత్త‌రాంధ్ర జిల్లాలైన విశాఖ‌, విజ‌యన‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల‌పై ప‌ట్టు సాధించేందుకు దాదాపు అన్ని రా జ‌కీయ పార్టీలూ ప్ర‌ధానంగా దృష్టి పెడ‌తాయి. దీనికి కార‌ణం.. ఈ మూడు జిల్లాల్లోనూ సుమారు కోటి మంది జ‌నాభా ఉన్నారు. వీరిలో 50శాతం ఓటు బ్యాంకు ఉంటుంది. పైగా ఇక్క‌డి ప్రాంతాల్లో ఎక్కువ‌గా మ‌న్యం ప్రాంతాలు కూడా ఉంటాయి. ఇలాంటి చోట ఒక్క‌సారి జ‌నం గుండెల్లో పాగా వేస్తే.. ఇక ఆ రాజ‌కీ య పార్టీకి తిరుగులేకుండా పోతుంద‌నేది వాస్త‌వం. రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌రిగే ఎన్నిక‌ల్లో ఉత్త‌రాంధ్ర ఓటు బ్యాంకుకు మ‌రింత ఎక్కువ‌గానే ప్రాధాన్యం ఉంది. అందుకే జ‌న‌సేనాని ప‌వ‌న్ కూడా ఉత్త‌రాంధ్ర జిల్లాల ఓటు బ్యాంకుపై క‌న్నేశారు.

 

అలాంటి ఉత్త‌రాంధ్ర‌లోనే టీడీపీ కూడా పాగా వేసేందుకు గ‌తంలో అనేక ప్ర‌య‌త్నాలుచేసింది. కొన్నాళ్లు కీల‌క నాయ‌కులు ఇక్క‌డ చ‌క్రం తిప్పారు. అయితే, ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకునేలా ఈ రాజ‌కీయ పార్టీ లు, నాయ‌కులు వ్య‌వ‌హ‌రించింది పెద్ద‌గా ఏమీలేద‌ని అంటారు ప‌రిశీల‌కులు. అందుకే వారు అనుకున్న రేంజ్‌లో ఈ ఉత్త‌రాంధ్ర‌లో పాగా వేయ‌లేక పోయార‌ని కూడా చెబుతారు. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు సంక‌ల్ప యాత్ర చేసిన వైసీపీ అధినేత జ‌గ‌న్.. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల మ‌న‌సుల్లోని త‌డిని తెలుసు కున్నారు. ఉత్త‌రాంధ్ర అన‌గానే వ‌ల‌స‌ల‌కు పెట్టింది పేరు. ఇక్క‌డ నుంచి కొన్ని వేల మంది వ‌ల‌స పోతూ.. పొట్ట పోసుకుంటున్నారు.

 

ఇలాంటి వారికి ఏదైనా చిన్న కార్య‌క్ర‌మం చేసి, ఇక్క‌డి వారికి స్తానికంగా ప‌ని దొరికేలా చేస్తే.. ఇక‌, తిరుగు ఉండ‌ద‌ని జ‌గ‌న్ గుర్తించారు. మ‌రీ ముఖ్యంగా గిరిజ‌నుల వృత్తుల‌ను ప‌రిర‌క్షించ‌డ‌మే కాకుండా .. వాటికి మార్కెటింగ్ కూడా క‌ల్పిస్తే.. తిరుగు ఉండ‌ద‌ని భావించారు. దీంతో ఎస్సీ, ఎస్టీ గిరిజ‌నుల‌కు తాజాగా కీల‌క ప‌థ‌కాలు ప్ర‌వేశ పెట్టారు. అదేస‌మ‌యంలో భోగాపురం విమానాశ్ర‌య నిర్మాణానికి కూడా జీఎంఆర్‌తో సంచ‌ల‌న స్థాయిలో ఒప్పందం చేసుకున్నారు. ప్రపంచ స్థాయిలో.. సీఎం జ‌గ‌న్ కోరుకునే విధంగా ఇక్క‌డ భోగా పురం విమానాశ్ర‌యాన్ని నిర్మించేందుకు జీఎంఆర్ ఒప్పందం చేసుకుంది.

 

దీనిద్వారా.. స్థానికంగా ఇప్ప‌టికిప్పుడు వ‌ల‌స కార్మికుల‌కు ఉపాధి క‌లుగుతుంది. అదేస‌మ‌యంలో ఆది లో ఈ విమానాశ్ర‌యానికి కేటాయించిన భూమిలో 500 ఎక‌రాల‌ను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంది. దీని లో విమానాశ్ర‌యానికి చేరువ‌లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్ర‌ణాళిక రూపొందిస్తోంది. త‌ద్వారా విమా నాశ్ర‌యం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. అదేరేంజ్ షాపింగ్ కాంప్లెక్స్‌ల‌ను స్థానికుల‌కు అప్ప‌గించ‌డంద్వారా ఇక్క ‌డి వారికి ఉపాధి ఏర్ప‌డుతుంద‌ని అంటున్నారు. ఇక‌, మెట్రో స‌హా అండ‌ర్ గ్రౌండ్ ర‌వాణా కు కూడా జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇక్క‌డ ప్రాధాన్యం ఇస్తోంది. ఫ‌లితంగా రాబోయే మూడేళ్ల‌లో ఉత్త‌రాంధ్ర‌కు స‌రికొత్త రూపం వ‌స్తుంద‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. ఇది.. పార్టీకి పెట్ట‌నికోట‌గా మారుతుంద‌ని వైసీపీనాయ‌కులు భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: