రాజకీయాల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్ ఉంటుంది.. వారి వారి స్టయిల్ తో కొందరు బాగా ఆకట్టుకుంటారు. అలాంటి ఓ మంత్రి జగన్ కేబినెట్ లో ఉన్నారు. ఆయనే సమాచార శాఖ మంత్రి పేర్ని నాని. కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తే అయినా ఆయన మాటల్లో చాలా వెటకారం ఉంటుంది. సింపుల్ గా మాట్లాడుతూనే సెటైర్లతో ప్రత్యర్థులకు చురకలు వేస్తారు. అదే సమయంలో మీడియాతోనూ బాగా క్లోజ్ గా ఉంటారు.

 

 

తానో మంత్రిని అన్న ఫీలింగ్ ఆయనలో ఎప్పుడూ కనిపించదు. డౌన్ టు ఎర్త్ అన్నట్టు ఉంటారు. అటు జనంలోనూ సులభంగా కలసిపోతారు. ఉదయాన్నే సొంతూళ్లు ఆకస్మికంగా పర్యటించినా.. ఓ బండేసుకుని చక్కర్లు కొట్టినా ఆయనకే చెల్లింది. కృష్ణా జిల్లావాడే అయినా గోదావరి జిల్లాల తరహా వెట‌కారం ఆయ‌న మాటల్లో క‌నిపిస్తుంది. తాజాగా అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలోనూ ఈ తరహా సెటైర్లు మరోసారి ఆ మంత్రి నోటి నుంచి వచ్చేసాయి.

 

 

అబ్బే.. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని కొట్టుకుంటూ తీసుకెళ్ల లేద‌ు.. ఆయ‌న న‌డుచూ కుంటూ అధికారుల‌తో వెళ్లార‌ంటూ పేర్ని నాని వెటకారంగా కామెంట్ చేశారు. అయినా ఉదయం 7:30కు అచ్చెన్నను అరెస్ట్‌ చేస్తే.. అర్థరాత్రి అంటారా? అంటూ మీడియానే ప్రశ్నించారాయన. ఇదే సమయంలో చంద్రబాబును టార్గెట్ చేస్తూ పంచ్ ల వర్షం కురిపించారు పేర్ని నాని.

 

 

వయసు రాగానే సరిపోదండీ.. భాష సరిగా ఉండాలి.. అచ్చెన్నాయుడు బీసీ కాబట్టి అరెస్ట్‌ చేయొద్దంటున్నారు. అంతేగానీ అవినీతి చేయలేదు అని చెప్పడం లేదు. అశోక్‌ లేలాండ్‌ పాత్ర ఉంటే దాన్ని కూడా విచారిస్తాం. లారీలను బస్సులుగా మార్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారు. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని టీడీపీ నేత‌లు అడ్డంగా దోచుకున్నారు.. అంటూ పేర్ని నాని చంద్రబాబును పేరు పెట్టకుండానే ఉతికి ఆరేశారు. మొత్తానికి ఇలాంటి మంత్రి ఒకడు ఉండాల్సిందే సుమా అని జర్నలిస్టులు ఫీలయ్యేలా ఉంటుంది పేర్ని నాని స్టయిల్.

మరింత సమాచారం తెలుసుకోండి: