అటు సినీ వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో ఈ మధ్య బాగా హాట్ టాపిక్ గా మారారు హిందూపురం ఎమ్మెల్యే, నందమూరి నటసింహం బాలకృష్ణ. మంత్రి తలసానితో సినీ పెద్దల భేటీ భూములు పంచుకోవడం కోసమేనని సంచలన ఆరోపణలు చేసి అందరినీ షాక్ కి గురి చేశారు. అలాగే ఈ మధ్య జరిగిన మహానాడు లో మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వం ఐదేళ్లు పాలన పూర్తి చేసుకోదని 2 ఏళ్లలో కూలిపోతుందన్నారు. అలాగే త్వరలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.

 

ఒక్క ఛాన్స్ అంటూ అడిగిన పార్టీ రాష్ట్రంలో ఏం చేస్తుందో అందరూ చూస్తున్నారని బాలయ్య అన్నారు. బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలలో కూడా బాలయ్య ఇదే మాట చెప్పారు. దీంతో రాజకీయ నాయకులు, విశ్లేషకులు ఆలోచనలో పడ్డారు. బాలయ్య లాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే ఇది కొంచం ఆలోచించాల్సిన విషయమేనని అభిప్రాయపడ్డారు. మరికొందరైతే బాలయ్య చెప్పింది నిజమేనంటూ దానికి వత్తాసు పలికారు. దీంతో బాలయ్య చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి.

 

అయితే బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు సొంత పార్టీ నుంచే ఒక కౌంటర్ పడినట్టు తెలుస్తుంది. ఆ కౌంటర్ ఇచ్చిన వ్యక్తి మరెవరో కాదు.. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. జేసీ ట్రావెల్స్‌‌ వాహనాలకు సంబంధించి తప్పుడు పత్రాలు సృష్టించారనే కేసులో శనివారం ఉదయం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీనిపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. పెద్ద మనిషికి ఏసు క్రీస్తు లేడు, శివయ్య లేడు, ఏడుకొండలవాడు లేడు, అల్లా అంతకన్నా లేడు అని ఆయన వైఎస్ జగన్ ను ఉద్దేశించి అన్నారు. అలాగే సంపన్నుడు నాలుగేళ్లు అధికారంలో ఉంటాడని, ఈ నాలుగేళ్లు ఎవరికి ఏమవుతుందో తెలియదని ఆయన అన్నారు.

 

దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. అదేంటి బాలయ్య 2 ఏళ్లు అని చెప్తుంటే.. జేసీ 4 ఏళ్లు అని చెప్తున్నారు. వీలల్లో వీళ్ళకి క్లారిటీ ఉండడా..? ఒకే పార్టీ నేతలు కదా ఒకేలా మాట్లాడకపోతే ఎలా చెప్పండి అంటూ కొందరు వ్యంగ్యంగా కౌంటర్ లు వేస్తుంటే. మరికొందరు మాత్రం ఇది బాలయ్యకి జేసీ వేసిన కౌంటర్ అని అంటున్నారు. అలాగే మొన్న బాలయ్య వ్యాఖ్యలతో సంబరాలు చేసుకున్న తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు జేసీ వ్యాఖ్యలతో తలలు పట్టుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: