``ముమ్మాటికీ మా నేత‌ల అరెస్టు వెనుక రాజ‌కీయ కార‌ణాలే ఉన్నాయి. త‌న పార్టీలో చేర‌లేద‌నే దుగ్ధ‌తోనే అ చ్చెన్నాయుడిని, ప్ర‌భాక‌ర్ రెడ్డిని, అస్మిత్‌రెడ్డిని జ‌గ‌న్ కుట్ర ప‌న్ని అరెస్టులు చేయించాడు. దొంగ కేసులు పె ట్టించాడు`` అంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబు మండిప‌డ్డారు. భారీ ఎత్తున టీడీపీ శ్రేణుల‌తో ఆయ‌న రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు కూడా పిలుపునిచ్చారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు కొన‌సాగుతున్నాయి. అయితే, బాబు మాట‌లే నిజ‌మ‌ని కొంత సేపు అనుకుందాం. వైసీపీ అధినేత జ‌గ‌న్ క‌క్ష‌గ‌ట్టి.. టీడీపీ నేత‌ల‌ను లొంగ‌దీసుకుంటున్నార‌ని న‌మ్ముదాం.. ఇప్పుడు వాస్త‌వంలోకి వెళ్లి చూద్దాం.

 

వాస్తవంలోకి వెళ్తే.. గ‌డిచిన ప్ర‌భుత్వంలో ర‌వాణా శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు వ్య‌వ‌హ‌రించారు. దీనికి ముందు ఆయ‌న కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఈసమ‌యంలో ఈఎస్ ఐ మందుల కుంభ‌కోణం జ‌రిగింద ‌నేది ఆరోప‌ణ. నిజానికి ఒక కీల‌క నేత‌ను , అందునా.. ఎమ్మెల్యేను అరెస్టు చేయ‌డం అంటే.. ఎలాంటి ఆరోప ‌ణ‌లు లేకుండా చేయ‌డం సాధ్య‌మ‌వుతుందా?  అధికారులు ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని, ఎంత లోతుగా వారు చేసిన త‌ప్పుల‌ను నిరూపించ‌గ‌ల‌గాలి?  ఒక‌వేళ నిరూపించ‌క‌పోతే.. స‌ద‌రు ద‌ర్యాప్తు సంస్థ‌పైనే న‌మ్మ‌కం స న్న‌గిల్ల‌దా?  ఇప్పుడు ఇవే ప్రశ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఒక‌వేళ‌.. చంద్ర‌బాబు ఒప్పుకొన్న‌ట్టు ఈ ఎస్ ఐలో మంత్రి పాత్ర‌లేద‌ని చెబుతున్నారు.

 

కానీ, అధికారుల త‌ప్పులేద‌ని అన‌డం లేదు. అంటే అధికారులు త‌ప్పులు చేశారు. సో.. మంత్రి త‌ప్పులేద ‌ని అంటున్నారు. అస‌లు అధికారుల‌ను లీడ్ చేయాల్సిన అవ‌స‌రం ఎవ‌రికి ఉంటుంది. ఎవ‌రు అధికారు ల‌ను క‌ట్ట‌డి చేయాలి? అంటే.. సందేహం లేకుండా మంత్రే! ఈ కేసులో పాత్ర‌ధారిగా ఉన్న మాజీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ విజ‌య్‌కుమార్ చెప్పిన‌ట్టు.. మంత్రి ఆదేశాలు లేకుండా తాము ఏ ఫైల్‌ను ముందుకు క‌దిలించ‌లే దన్న‌ది నిజం. ఇలాంటిస‌మ‌యంలో అచ్చెన్న త‌ప్పులేద‌ని బాబు ఎలా చెప్ప‌గ‌ల‌రు?  ఇక‌, ప్ర‌భాక‌ర్‌రెడ్డి కేసులోనూ చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల‌కు, క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న దానికీ సంబంధం లేదు.

 

వాహ‌నాల‌కు దొంగ రికార్డులు సృష్టించిన మాట వాస్త‌వ‌మేన‌ని ప్ర‌భాక‌ర్‌రెడ్డి సోద‌రుడు దివాక‌ర్‌రెడ్డి ఒప్పుకొన్నారు. అదే స‌మ‌యంలో న‌కిలీ స‌ర్టిఫికెట్లు కూడా ముద్రించార‌నేది స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఈ స‌మ‌యంలో కేసులు పెట్ట‌కుండా.. క‌ప్పిపుచ్చుతారా? చ‌ంద్ర‌బాబు.. ఇదేనా మీ ఫార్టీ ఇయ‌ర్స్ అనుభ‌వం? అని మేధావులు ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా.. చంద్ర‌బాబు ఇంకా వాస్త‌వాలు గ్ర‌హించే స్థితిలో లేకుండా.. పార్టీ కోసం ప్రాపు కోసం.. త‌న నేత‌లు ఏం చేసినా.. గాలికి వ‌దిలేస్తే.. ఫ‌లితాలు ఇలానే ఉంటాయి. ఇప్పుడు మొత్తుకుని ఏం లాభం?  చిన్న‌వాడైనా.. జ‌గ‌న్‌.. త‌న నేత‌ల‌కు అవినీతి అంటేనే బెదురు పుట్టేలా చేస్తున్నారు. ఈ త‌ర‌హా వాతావ‌ర‌ణం టీడీపీ నేత‌ల్లో.. ఆనాటి అధికారుల్లో ఎప్పుడైనా చంద్ర‌బాబు క‌లిగించారా?  లేదు కాబ‌ట్టి.. ఫ‌లితం ఈనాడు క‌ళ్ల‌ముందు క‌నిపిస్తోంది!!

మరింత సమాచారం తెలుసుకోండి: