అధికార పార్టీ నేత‌, సీఎం జ‌గ‌న్‌.. త‌న పార్టీ నేత‌ల‌కు పాఠాలు చెబుతున్నారా?  ఆయ‌న నేరుగా చెప్ప‌క‌పో యినా.. త‌న‌దైన శైలిలో వారికి జాగ్ర‌త్త‌లు నేర్పుతున్నారా?  ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌, ప్ర‌జ‌ల ధ‌నం విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలో.. ఎలా వ్య‌వ‌హ‌రించ కూడ‌దో కూడా ఆయ‌న చెప్పేస్తున్నారా? అంటే.. తాజా ప‌రిణామాల ‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి మరీ ముఖ్యంగా ఎన్నిక‌ల్లో గెలిచిన వారికి ఒక విధ‌మైన కోరిక బ‌లంగా ఉంటుంది. అదికారం చ‌లాయించ‌డం... త‌మ‌ను అణ‌గ‌దొక్కాల‌నే వారికి గ‌ట్టిగా బుద్ది చెప్ప‌డం.

 

అదేస‌మ‌యంలో ఎన్నిక‌ల్లో పెట్టిన ఖ‌ర్చును రాబ‌ట్టుకోవ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు చేసుకోవ‌డం. త‌న వారికి ప‌ద‌వులు ఇప్పించుకోవ‌డం.. ఇవి సాధార‌ణంగా ఉండే ల‌క్ష‌ణాలు. అయితే, ఈ ప‌రిణామాలే అవినీతికి, అక్ర‌మాల‌కు దారితీసి ఏకంగా పార్టీ ప్ర‌తిష్ట‌నే దారిమ‌ళ్లించేసిన సంద‌ర్భాలు మ‌న‌కు క‌నిపిస్తు న్నాయి. తాజాగా టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టు వెనుక అవినీతి ఉంద‌నేది అధికారుల మాట‌. అదే స‌మ‌యంలో మాజీ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్‌రెడ్డి అరెస్టు వెనుక అక్ర‌మాలు ఉన్నాయ‌నేది స్ప‌ష్టంగా ప్ర‌భుత్వ‌మే చెబుతోంది. అదేస‌మ‌యంలో నోటి దుర‌ద‌.. స్థాయికి మించి మాట్లాడ‌డం అనేది కూడా క‌నిపిస్తోంది.

 

ఆయా విష‌యాల‌తోనే వీరిద్ద‌రిపైనా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది. వీటిని బ‌ట్టి.. జ‌గ‌న్‌త‌న పార్టీ నేత‌ల‌కు నేర్పుతున్న పాఠం కూడా ఇదే! అవినీతి చేస్తే.. ఇప్పుడు తాను ఊరుకున్నా..రేపు వ‌చ్చే ప్ర‌భుత్వాలు వాటిపై కొర‌డా ఝ‌ళిపిస్తే.. ఏం జ‌రుగుతుందో ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌న ప్ర‌భుత్వం, పార్టీపై ఎలాంటి అవినీతి మ‌ర‌కా లేకుండా చూసుకునే క్ర‌మంలో మంత్రి నుంచి ఎమ్మెల్యే వ‌ర‌కు ఎవ‌రు అవినీతి చేసినా కూడా స‌హించ‌డం లేదు.

 

అదే స‌మ‌యంలో నోటికి ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడినా.. అక్ర‌మాలు చేసినా ఏం జ‌రుగుతుందో కూడా ఆయ‌న‌చెప్ప‌క‌నే చెప్పారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీ నేత‌ల‌కు మౌఖికంగా చెప్పిన జ‌గ‌న్‌.. ఇప్పుడు త‌న చేత‌ల ద్వారా ప్ర‌తిప‌క్షాన్ని క‌ట్ట‌డి చేయ‌డం ద్వారా సొంత పార్టీ నేత‌ల‌కు కూడా చెప్ప‌క‌నే పాఠాలు చెబుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: