నేటిత‌రం రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకోవాలంటే త‌ప్ప‌నిస‌రిగా సొంత మీడియా ఉండాల‌ని రాజ‌కీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో జ‌న‌సేన అధినేత వ‌ప‌న్ క‌ళ్యాన్ కూడా చేరిపోయారు. వాస్త‌వానికి ఈజాబితాలో ఆయ‌న ఎప్పుడో చేరిపోయిన‌ప్ప‌టికీ ఆల‌స్యంగా బ‌య‌ట‌కు తెలిసిదంటే. సొంత ప‌త్రిక‌ను ప్రారంభించాల‌ని గ‌తంలోనే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టార‌ని స‌మాచారం. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు మాత్రం ప‌వ‌న్ క‌ళ్యాన్ అధికారికంగా ఆ వివ‌రాలు వెల్ల‌డించ‌లేదు. ఇప్ప‌టికైతే జ‌న‌సేన‌ను సోష‌ల్ మీడియా ద్వారానే జ‌నంలోకి తీసుకెళ్తున్నారు. కొత్త ప‌త్రిక‌ను ప్రారంభించ‌డం కంటే...ర‌న్నింగ్‌లో ఉన్న ఏదో ఒక ప‌త్రిక‌ను  టేకోవ‌ర్ చేయ‌డం ఉత్త‌మ‌మ‌ని ఆయ‌న‌కు ప‌లువురు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు కూడా స‌ల‌హాలిస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. 

 

ఇంత‌కు ప‌వ‌న్‌కు మీడియా అంత అవ‌స‌రమా అంటే..ఖ‌చ్చితంగా అవ‌స‌ర‌మ‌ని ఆ  పార్టీలోని కొంత‌మంది సీనియ‌ర్ నాయ‌కులు చెబుతున్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణానంత‌రం వైసీపీని స్థాపించి...అనేక గంద‌ర‌గోళ ప‌రిస్థితుల్లో...చిక్కుల్లో ప‌డిన జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి సాక్షి మీడియా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డింద‌ని గుర్తు చేస్తున్నార‌ట‌. అంతేకాదు ప‌రిస్థితులు మునుప‌టి మాదిరిగా లేవు...ఎంత‌సేపు ఇత‌ర మీడియాల‌తో ఆయా పార్టీలు జ‌న‌సేన‌ను దెబ్బ‌తీసేలా వండి వార్చే వార్త క‌థ‌నాలతో ఖ‌చ్చితంగా న‌ష్టం చేకూరుతోంద‌ని, సొంత మీడియా ఉంటే మ‌న వాయిస్ కూడా జ‌నంలోకి వెళ్తుంద‌ని సూచించిన‌ట్లు తెలుస్తోంది.

 

ఈక్ర‌మంలోనే ప‌త్రిక‌ను ప్రారంభించాల‌ని గ‌ట్టిగా నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఓ టీవీ చాన‌ల్‌ను జ‌న‌సేన అధినేత భాగ‌స్వామ్యంతో నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇందులో పూర్తి స్ప‌ష్ట‌త లేదు. ఇదిలా ఉండ‌గాఛాన‌ళ్లూ, పేప‌ర్లూ, వెబ్ సైట్లూ… వేటిపైనా త‌న‌కు న‌మ్మ‌కం లేద‌ని త‌న అభిప్రాయాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పారు  మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు. ప్ర‌తీ పార్టీకీ అండ‌గా ఓ మీడియా ఉంటోంది విమ‌ర్శిస్తే తిడుతూ వార్త‌లు రాస్తారు... పొగిడితే మెచ్చుకుంటూ వార్త‌లు రాస్తారు.. ఇవ‌న్నీ చూశాక నాకు మీడియాపై న‌మ్మకం పోయిందంటూ వ్యాఖ్య‌నించిన నాగ‌బాబు కొద్దిరోజుల క్రితం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ”ఓ పేప‌ర్ పెట్టే ఆలోచ‌న‌లు ఉన్నాయి. అందుకోసం స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి” అంటూ అస‌లు విష‌యం చెప్పేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: