ప్రకాశం జిల్లాలో 24 గంటల వ్యవధిలోనే ఐదుగురు విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకున్నారు .ఈ ముగ్గురు విద్యార్థినులు కూడా ప్రకాశం జిల్లాకు చెందిన వారే కావడంతో గ‌మ‌నార్హం.  ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఐదుగురు ఇంటర్ విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా నాగులప్పలపాడులో బావిలో దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ప్రకాశం జిల్లాలోనే మద్దిపాడు మండలం వల్లవరంలో ఇంటర్ పస్ట్ ఇయర్ విద్యార్థి ప్రాణాలు తీసుకుంది. గుంటూరు జిల్లా పిడిగురాళ్ల జూలకల్లులో పురుగులమందు తాగి విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. కడప జిల్లా రాజంపేటలో పావని అనే ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడింది. చిత్తూరు జిల్లా పలమనేరు కొత్తపేట బోయవీదిలో మరో విద్యార్థిని తనువుచాలించింది. 


ఎపిలో ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పరీక్షల్లో ఫెయిలయ్యామనే మనస్తాపంతో విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విద్యార్థులు ఆత్మహత్యలతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ‌తంలో తెలంగాణ‌లోనూ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌లైన స‌మ‌యంలో వ‌రుస‌గా విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌లు జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.ఒక్క హైద‌రాబాద్ దాని చుట్టుప‌క్క‌లా ప్రాంతాల్లోనే ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యామని మనస్తాపం చెందిన ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని కోఠిలోని ప్రగతి మహా విద్యాలయ కాలేజీలో చదువుతున్న అనామిక ఇంటర్‌లో ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో కలత చెంది ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.


 మారేడ్‌పల్లిలో ఇంటర్ విద్యార్థిని లాస్య, వరంగల్‌లోని దర్గాఖాజీపేటకు చెందిన మోడెం, నిజామాబాద్ జిల్లా ఎడవపల్లి మండలంలోని ఎఆర్‌పి క్యాంప్‌లో వెన్నెల, రాచకొండ కమిషనరేట్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నారు. వాస్త‌వానికి త‌ల్లిదండ్రులు ఏమంటారోనన్న భ‌యం, చుట్టూ ఉన్న‌వారు హేళ‌న చేస్తారేమోన‌న్న ఆలోచ‌న‌ల‌తో వీరంతా ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన‌ట్లుగా విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పిల్ల‌ల్లో మాన‌సిక స్తైర్యంను పెంపొందించాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయుల‌పై ఉంద‌ని చెబుతున్నారు. వారు ఒత్తిడికి లోన‌వుతున్నట్లుగా గుర్తించి నిబ్బ‌రంగా ఉండాల‌ని చెబితే ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఉండ‌వ‌ని సూచిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: