రెండు తెలుగు రాష్ట్రాల‌పైనా ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఏపీ, తెలంగాణ‌ల్లో క‌క్ష పూరిత రాజ‌కీయాలు న‌డుస్తున్నాయ‌నే విష‌యంపై మేధావులు సైతం చ‌ర్చిస్తున్నారు. ఎందుకంటే.. అటు తెలంగాణ‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ చీఫ్ ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి, ఇటు ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు కూడా రాష్ట్రంలో అధికార పార్టీ.. సీఎం కూడా త‌మ‌పై క‌క్ష‌పూరితంగా.. అణిచి వేయాల‌నే ఉద్దేశంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని భారీ ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.ఈ నేప‌థ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల‌పైనా మేధావులు దృష్టి పెట్టారు.

 

తెలంగాణ‌లో ప్ర‌భుత్వం ఏర్ప‌డి.. ఏడాదిన్న‌ర అయింది. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్తి చేసుకుంది. ఈ కాలంలో నిజంగానే ప్ర‌తిప‌క్షాల‌పై అణ‌చివేత కార్య‌క్ర‌మాలు సాగాయా?  ప్ర‌జాస్వామ్యంలో అలా అణిచివేత‌ల‌కు, నిర్బంధాల‌కు కుదురుతుందా? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఇక్క‌డ చిత్ర‌మైన విష‌యం ఏంటంటే.. తెలంగాణ‌లో క‌న్నా.. ఏపీలో విప‌క్షాల‌కు బ‌ల‌మైన మీడియా అండ‌దండ‌లున్నాయి. తెలంగాణ లోనూ మీడియా ఉన్న‌ప్ప‌టికీ.. అక్క‌డ ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకించే సాహ‌సం చేయ‌డం లేదు. కానీ, ఏపీలో ప్ర‌తిప‌క్షాల‌ను వెనుకేసుకు వ‌చ్చే మీడియా సాధ‌నాలు ఎక్కువే.

 

అలాంటి స‌మ‌యంలో అణిచివేత సాధ్య‌మేనా? చ‌ంద్ర‌బాబు చెప్పిన‌ట్టు.. రాజ‌కీయ ప్ర‌తీకారేచ్ఛ‌తో జ‌గ‌న్ ర‌గిలిపోతున్నారా? అంటే.. ఇలా ఒక‌వేళ బాబు చెప్పిందే నిజ‌మ‌ని అంటే.. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భు త్వం, టీడీపీ నేత‌లే దీనికి పూచీ ప‌డాల్సి ఉంటుంది. ఎందుకంటే. ప్ర‌తీకారం అనేది ఇప్ప‌టికిప్పుడు అ మాంబాప‌తుగా పుట్టేది కాదుక‌దా?! గ‌తంలో జ‌గ‌న్‌ను, ఆయ‌న పార్టీని, నేత‌ల‌ను వేధించిన కార‌ణంగా.. దూ షించిన కార‌ణంగానే క‌దా.. ప్ర‌తీకారం అనేది పురుడు పోసుకుంటుంది!?  మ‌రి దీనికి బాబోరు ఏమ‌ని ఆన్స‌ర్ చేస్తారో ?  ఇక‌, తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. ఈ రాష్ట్రంలో పోలీసులు ఐపీఎస్‌లు కాద‌ని.. కేపీఎస్‌ల‌ని (క‌ల్వ‌కుంట్ల పోలీస్ స‌ర్వీస్) అని త‌మ‌ను అణిచేసేందుకు వారు ఖాకీ దుస్తులు వేసుకున్నార‌ని ఉత్తమ్ స‌హా కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శించారు.

 

వాస్త‌వానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వాలు లేవనేది మేధావుల మాట‌. ప్ర‌జాస్వామ్య యుతంగా ఏర్పాటైన ప్ర‌భుత్వాల‌పై పైచేయి సాధించేందుకు(స‌హ‌జంగా ప్ర‌తిప‌క్షాలుఇలానే ఉంటాయ‌నే మేధావులు కూడా ఉన్నారు) ప్ర‌తిప‌క్షాలు ప్ర‌య‌త్నించ‌డమే.. ర‌గ‌డ‌కు దారితీస్తోంది. అదేస‌మ‌యంలో అదికారం అండ చూసుకుని ఏపీలో గ‌తంలో వైసీపీ నేత‌ల‌పై దుర్భాష‌లాడ‌డం వంటివి కూడా ఇప్పుడు జ‌రుగుతున్న ప‌రిణామాల‌కు కార‌ణం కాగా, అస‌లు తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లిన ఉద్దేశం .. ప్ర‌తిప‌క్షం చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకేక‌దా! ఇవ‌న్నీ వ‌దిలేసి.. సాము చేస్తే.. ప‌రిస్థితి ఇలానే ఉంటుంద‌నే ఆలోచ‌న ప్ర‌తిప‌క్షాల‌కు లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల‌ను ప‌ట్టుకుంటే.. ప్ర‌జల ప‌క్షాన నిల‌బ‌డితే.. వారికి ప‌రువు, మ‌ర్యాద ద‌క్కుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: