మాజీమంత్రి అచ్చెన్నాయుడి అరెస్టు విషయంలో చంద్రబాబు చేతులెత్తేశారా..? దీంతో ఎంపీ రామ్మోహన్ నాయుడు మరో కొత్త మార్గం వెతుకుతున్నారా..? బాబాయి కోసం అబ్బాయి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా..? అంటే అవునని చెప్పక తప్పట్లేదు.

 

టీడీపీ ప్రభుత్వం హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, రాజకీయ నాయకుల మధ్య విమర్శలు, మీడియాలో చర్చలు, డిబేట్లు అబ్బో.. ఇలా చాలానే జరిగాయి. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఈ వ్యవహారాన్ని ఖండిస్తూ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులుచేరిగారు. అలాగే దీనికి కులం రంగు పూసే ప్రయత్నాలు కూడా చేశారు.

 

అలాగే అచ్చెన్న అరెస్టుపై ఆయన అన్న కొడుకు ఎంపీ రామ్మోహన్ నాయుడు చాలా ఘాటుగా స్పందించారు. అచ్చెన్నాయుడు బలమైన వాయిస్  వినిపిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే ఉద్దేశంతో ఆయనను ఇబ్బందులు పెడుతున్నారని ఆయన అన్నారు. ఒక్క నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేశారని, ఈ విధానం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు. అలాగే ఈ విషయంలో అసలు భయపడమని, ఎన్ని రకాలుగా భయపెట్టాలని ప్రయత్నించినా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని అన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని వార్నింగ్ లు ఇచ్చినా.. జరగాల్సింది జరిగిపోయింది, అచ్చెన్నను 14 రోజుల పాటు రిమాండ్ కి తరలించడం జరిగింది.

అయితే బాబాయిని ఎలాగైనా బయటకి తీసుకురావాలని రామ్మోహన్ చంద్రబాబుని అడిగారట. దీంతో చంద్రబాబు రామ్మోహన్ కి పూసగుచ్చినట్టు అంతా వివరించారాట.. ఈ విషయంలో తాను ఏం చేయలేనని, రాష్ట్ర ప్రభుత్వం మరీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పారని తెలుస్తుంది. అలాగే అచ్చెన్నను కాపాడేందుకు ఒక ఐడియా కూడా రామ్మోహన్ కు ఇచ్చారట. ఈ విషయంలో స్వయంగా రామ్మోహన్నే కేంద్ర పెద్దలని సంప్రదించమని కోరారట. రామ్మోహన్ కూడా చంద్రబాబు ఆదేశాలతో కేంద్ర పెద్దలని సంప్రదించడం, విషయం మొత్తం వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా ఈ విషయమై సాయం చేస్తామని, అచ్చెన్నాయుడిని బయటికి తీసుకొస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. కాకపోతే దీనికి ప్రతిఫలంగా రామ్మోహన్ నాయుడిని బీజేపీలో చేరమని షరత్తు పెట్టినట్టు తెలుస్తుంది. దీంతో వెంటనే చంద్రబాబు అంగీకారంతో రామ్మోహన్ బీజేపీలో చేరేందుకు ఒకే చెప్పినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: