ఆయన దేశ రాజకీయాలనే శాసించినవాడు, రాజకీయ చదరంగంలో ఆరితేరినవాడు. వ్యూహాలు పన్నడంలో దిట్ట, తన తెలివితేటలతో ప్రపంచ నేతలు సైతం ఆశ్చర్యపరిచాడు.. ఇదంతా ఒకప్పటి మాట. మరి ఇప్పుడు.. ఆయన అవకాశవాది, నమ్మిన వారినే నట్టేట ముంచే ఘనుడు, ఆయనకి చాదస్తం బాగా పెరిగిపోయింది. ఇవన్నీ వినగానే ఈ పాటికే మీ బుర్రకి ఒక పేరు తట్టుంటుంది. అవునూ నేను మాట్లాడేది టీడీపీ అధినేత చంద్రబాబు గురించే. ప్రస్తుత పరిణామాలు చేస్తుంటే రాజకీయంగా ఆయన డీలా పడిపోయినట్టు తెలుస్తుంది. అందుకే నల్లచొక్కాలు వేసుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ఆయనకి అని రాజకీయవర్గాల్లో చర్చ.

 

టీడీపీ నేతల అక్రమ అరెస్టులపై నిరసన తెలిపేందుకు నల్లచొక్కాలతో అసెంబ్లీకి వెళ్లాలని పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో నిర్ణయించిన చంద్రబాబు... ఆ మేరకు తాను కూడా నల్లచొక్కా వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. గతేడాది ఫిబ్రవరితో జరిగిన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నాడు సీఎం హోదాలో చంద్రబాబు నల్లచొక్కా వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చే విషయంలో కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందని ఆరోపించిన చంద్రబాబు... అందుకు నిరసనగా అసెంబ్లీకి నల్లచొక్కా వేసుకుని వచ్చారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో ఆయన నల్లచొక్కా వేసుకోవడం అదే మొదటిసారి.

 

అయితే ఏడాది తరువాత సీఎం స్థాయి నుంచి ప్రతిపక్ష నేత స్థాయికి చేరుకున్న చంద్రబాబు... మళ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగానే నల్లచొక్కా వేసుకుని అసెంబ్లీకి రావడం గమనార్హం. అయితే గతంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరుకు నిరసనగా నల్లచొక్కా వేసుకున్న చంద్రబాబు... ఈసారి ఏపీలోని అధికార వైసీపీ తీరుకు నిరసనగా నల్లచొక్కా వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. దీనిపై విభిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకి ఇలా నల్లచొక్కాతో రెండు సార్లు కనిపియడంతో రాజకీయంగా ఆయన పని అయిపోయినట్టే అని కొందరి అభిప్రాయం. మరికొందరేమో చంద్రబాబు వ్యూహాలు రచించడంలో విఫలమవుతున్నారని అందుకే ఇలాంటి పరిస్తితులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఇంకొందరేమో ఏదేమైనా... ఏపీలో వరుసగా రెండో బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు నల్లచొక్కా వేసుకుని రావడం చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: