ఏపీ సీఎం జగన్ తన పంతం నెరవేర్చుకున్నారు. కీలకమైన వికేంద్రీకరణ బిల్లును మరోసారి అసెంబ్లీలో ఆమోదించుకున్నారు. రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థను రద్దు చేస్తూ కూడా బిల్లును ఆమోదించింది. వాస్తవానికి ఈ బిల్లులను గతంలో శాసనసభ ఒకసారి ఆమోదించింది. అయితే ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన రాజకీయ వ్యూహంతో అడ్డుకున్నారు. మండలిలో టీడీపీకి ఉన్న మెజారిటీని ఉపయోగించుకున్నారు.

 

 

దీంతో అప్పట్లో జగన్ కు భంగపాటు తప్ప లేదు. అయితే శాసన మండలి అధికారాలు చాలా పరిమితం. అది ఎలాంటి బిల్లునైనా ఆమోదించకుండా మహా అయితే ఓ నాలుగు నెలలు మాత్రమే ఆపే అవకాశం ఉంది. ఆ తర్వాత అసెంబ్లీలో అదే బిల్లు మరోసారి పెడితే ఇక అసెంబ్లీదే ఫైనల్ నిర్ణయం అవుతుంది. ఇప్పుడ జగన్ ఇదే సీన్ ఫాలో అవుతున్నాడు. నిర్దిష్ట గడువు తర్వాత తిరిగి అసెంబ్లీలో ఆమోదిస్తే ఆటోమాటిక్ గా బిల్లు ఆమోదం పొందుతుంది.

 

 

ఈ నేపద్యంలో ఈ రెండు బిల్లులను ఎపి ప్రభుత్వం తిరిగి ప్రవేశ పెట్టి ఆమోదం పొందింది. అంటే రాజధాని బిల్లుకు లైన్ క్లియర్ అయినట్టేనన్నమాట. అయితే రాజధాని అంశంపైనా కోర్టులో కేసు నడుస్తోంది కాబట్టి అది ఒక పట్టాన వచ్చే విషయం కాదు. గతంలో ఇదే తరహా బిల్లు వ్యవహారంపై మండలిలో జరిగిన పరిణామాలపై కొందరు కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు రెండోసారి అసెంబ్లీ బిల్లు ఆమోదించినందున కోర్టు జోక్యం చేసుకుంటుందా? లేదా అన్నది చూడవలసి ఉంటుంది. ఏదేమైనా చంద్రబాబు వీలైనంతగా లాయర్లతో చర్చిస్తున్నారు. న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: