సీఎం కేసీఆర్ కి ధీటైన ప్రత్యర్థి ఎవరంటే.. ఎక్కువగా వినిపించే పేరు రేవంత్ రెడ్డి. అంతలా రేవంత్, కేసీఆర్ పై విరుచుకుపడుతుంటారు. ఇంకోలా చెప్పాలంటే.. కేసీఆర్ కి రేవంత్.. కంట్లో నలుసులా, పంటికింద రాయిలా అన్నట్టు. అసలు ఈ ముచ్చట ఇప్పుడు మనం మాట్లాడుకోనికి కారణం ఏందంటే.. కోరోనా వచ్చిన మొదట్లో కేసీఆర్ ఒక సంచలన ప్రకటన చేశాడు. హైదరాబాదుకు చుట్టు ఒక్కో ఆస్పత్రిని ఘనంగా నిర్మించుకుందాం. గచ్చిబౌలిలో టిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తాం అని ప్రకటించారు. ఏప్రిల్ లో దీన్ని ప్రారంభం కూడా చేశారు.

 

ఈ సందార్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… పది వేల కేసులు వచ్చినా తట్టుకునే స్థితిలో ప్రభుత్వం ఉంది. ఆందోళన అక్కర్లేదు అని కేసీఆర్ ఘనంగా ప్రకటించారు. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. రోజులు మారుతున్న కొద్ది కరోనా తీవ్రత పెరగటం మొదలుపెట్టింది. గాంధీలో పేషెంట్లు నిండిపోవడంతో నిమ్స్ ను కోవిడ్ ఆస్పత్రిగా మార్చమని ఆదేశాలు ఇచ్చారు. అయితే… మరి “టిమ్స్” ఏమైందని చాలామందిలో అనుమానం వచ్చింది. ఈక్రమంలోనే ఎంపీ రేవంత్ రెడ్డి టిమ్స్ ను ఆకస్మికంగా సందర్శించారు. “అక్కడ ఎటువంటి ఆస్పత్రి సదుపాయాలు లేవు.. నలుగురు సెక్యూరిటీ మాత్రమే ఉన్నారు.. ఇదీ మన ముఖ్యమంత్రి మాటల గారడీ.. ఆయనలో గొప్పలు చెప్పుకోవడం తప్ప ఏమీ ఉండదు. టిమ్స్ గురించి అంత గొప్పగా చెప్పాడు? చివరకు నిమ్స్ మీద ఆధారపడ్డారు.. అంత ఘనంగా ప్రచారం చేసుకుని మీడియాలో రాయించుకున్నాడు… ఈ ఆస్పత్రికి కనీసం డ్రైనేజీ లేదు” అని ఫైరయ్యారు.

 

అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది..అదేంటంటే.. రేవంత్ ప్రశ్నించినందుకో, మరేదైనా కారణమో తెలియదు కానీ… ఉన్నపలంగా టీమ్స్ లో ఆస్ప‌త్రిలో సిబ్బంది నియామకానికి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ మేరకు టిమ్స్ లో 499 మంది వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది సర్కార్. అయితే ఇప్పుడు దీనిపై అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియా మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రేవంత్ పర్యటించారు, వాస్తవాలు బయటపెట్టారు కాబట్టి… టీమ్స్ ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ఆస్పత్రిలో సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడలచేసిందా..?

 

ఒకవేల అదే నిజమైతే ఈ నోటిఫికేషన్ కచ్చితంగా రేవంత్ విజయమనే చెప్పాలి. లేకపోతే ముందుగానే సర్కార్ ఈ ప్లాన్ చేసుకుంటే… ఆ విషయం రేవంత్ కి ముందే లీకై టీమ్స్ ని సందర్శించటానికి వెళ్లార అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ మధ్య ప్రభుత్వంలో జరిగేవన్నీ రేవంత్ కి తెలిసిపోతున్నాయి.. మొన్న కూడా ఇలానే ఈటెలను పదవి నుంచి తప్పించబోతున్నట్టు తనకు సమాచారం ఉందని బాంబ్ పేల్చారు. దీన్నిబట్టి చూస్తుంటే.. కేసీఆర్ టీం లో రేవంత్ కోవర్టులు ఉన్నారా? అనే అనుమానాలు ఎక్కువగా కలుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: