తెలుగుదేశంపార్టీ శాడిజం మరోసారి బయటపడింది. మొన్నటి ఎన్నికల్లో  జనాలు ఘోరంగా ఓడించారనే అక్కసు టిడిపిలో ఇంకా తగ్గినట్లు లేదు. జనాలపై పేరుకుపోయిన మంటను అఖండ మెజారిటితో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చూపుతోంది. తాజాగా శాసనమండలిలో  బడ్జెట్ ఆమోదాన్ని అడ్డుకోవటంతో పాటు రెండు కీలకమైన సిఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లులపై చర్చ జరగనీయకుండా అడ్డుకోవటమే ఇందుకు నిదర్శనం. పై బిల్లులను అడ్డుకోవటం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఓసారి అడ్డుకుని అభాసుపాలైంది. అయినా తన పంథాను మార్చుకోలేదన్న విషయం అర్ధమైపోతోంది.

 

ఇంతకీ ఏమి జరిగిందంటే మంగళవారం అసెంబ్లీలో ఏకగ్రీవంగా పాసైన బడ్జెట్ ను ప్రభుత్వం బుధవారం శాసనమండలిలో ప్రవేశపెట్టింది. అయితే ఏ బిల్లును ముందు ప్రవేశపెట్టాలి ? బడ్జెట్ పై ఎప్పుడు చర్చించాలనే విషయంలో పెద్ద గొడవే అయ్యింది. ముందు బడ్జెట్ పై చర్చ జరగాలని టిడిపి పట్టుబడితే బడ్జెట్ పై చివరలో చర్చ జరిగటం ఆనవాయితీగా వస్తోందంటూ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి చెప్పాడు. తన వాదనకు మద్దతుగా గతంలో  జరిగిన విధానాలను కూడా బుగ్గన సభ  ముందుంచాడు. అయినా యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని టిడిపి సభ్యులు వినిపించుకోలేదు. ఐదేళ్ళపాటు ఆర్ధికమంత్రిగా కూడా పనిచేసిన యనమల కావాలనే గోల మొదలుపెట్టినట్లు అర్ధమైపోతోంది.

 

అలాగే రెండు బిల్లుల విషయంలో కూడా టిడిపి ఇదే విధంగా వ్యవహరించింది. ఈ రెండు బిల్లులను నాలుగు నెలల క్రితం మొదటిసారి చర్చ జరగకుండా టిడిపి అడ్డుకున్న విషయం తెలిసిందే. జనవరి 22వ తేదీన ఇవే బిల్లులను ప్రవేశపెట్టినపుడు కూడా టిడిపి ఇలాగే గోల చేయటంతో ఎటువంటి చర్చను జరపకుండానే సభ వాయిదా పడిన విషయం గుర్తుంటే ఉంటుంది. అవే బిల్లులను అదే పద్దతిలో టిడిపి రెండోసారి కూడా గోల చేస్తు అడ్డుకుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే పై బిల్లులను టిడిపి ఎక్కువ రోజులు అడ్డుకోలేందని.   మొదటిసారి అడ్డుకున్న బిల్లులు మూడు నెలల అమలు కాకుండా అడ్డుకోగలదు. తర్వాత మరో నెల రోజులు మాత్రమే అమలు కాకుండా ఆగిపోతాయన్న విషయం టిడిపికి కూడా బాగా తెలుసు.

 

సో ఈ బిల్లుల ఆమోదం విషయంలో టిడిపి ఎంత గోల చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు. రెండోసారి కూడా టిడిపి అడ్డుకున్న బిల్లులు రెండు జూలై 16వ తేదీ తర్వాత ఆటోమెటిక్ గా అమల్లోకి వచ్చేస్తాయి. ఇక బడ్జెట్ ఆమోదం విషయం తీసుకున్నా మహా అయితే 14 రోజులు మాత్రం ఆగిపోతుంది. అంటే జూన్ 30వ తేదీ తర్వాత శాసనమండలిలో  బడ్జెట్ ఆటోమేటిక్ గా పాస్ అయిపోతుంది. ఈ విషయాలు టిడిపికి తెలిసినా అడ్డుకుని గోల చేస్తోంది కాబట్టే దాని శాడిజం బయటపడిపోతోంది.

 

ఇదే విషయాన్ని బిజెపి, వామపక్షాల సభ్యులు మాట్లాడుతూ యనమల రామకృష్ణుడుపై మండిపోతున్నారు. మండలిలో జరిగిన గోలకు కేవలం యనమలే కారణమంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడును మండలిలో యనమల తప్పుదోవ పట్టిస్తున్నట్లు తీవ్రంగా ఆరోపించారు. అనసరవమైన గలబా చేయటం వల్ల టిడిపి సాధించేదేమిటో ఎవరికీ అర్ధం కావటం లేదంటూ యనమల, టిడిపిపై తమ అసంతృప్తిని వ్యక్తం చేయటం గమనార్హం.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: