సిగ్గుందా.. అసలు ఈ మానవ జాతికి కొంచమైన సిగ్గుందా..? ఈ మాటలు అందరినీ ఉద్దేశించి అనేవి కాదు.. కేవలం కొందరు మానవ మృగలను ఉద్దేశించి అంటున్నవి మాత్రమే. మనకన్నా జంతువులు నయం అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తుంటే.. తమ కడుపున పుట్టిన బిడ్డలను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాయి. అత్యంత క్రూర మృగాలు సైతం వాటి పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటాయి. వాటి జోలికి వస్తే మాత్రం వేటాడుతాయి. కానీ కొందరు మనుషులు మాత్రం అలా కాదు.. తమ కడుపున పుట్టిన కూతురినే వేటాడుతున్నారు. అత్యంత పాశవికంగా మీద పడిపోయి రెచ్చిపోతున్నారు. తమ పుట్టకకు కారణమైన తండ్రి మర్మాంగం కింద ఎంతో మంది కన్న కూతుర్లు నలిగిపోతున్నారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఎన్నో చోటుచేసుకున్నాయి. తాజాగా హైదరాబాద్‌ నగర శివారు మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా సురారంలో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి తన కూతురును చెరబట్టి గర్బవతిని చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

 

కర్ణాటకలోని దర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆరేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం నగరానికి కుటుంబంతో వలస వచ్చాడు. సూరారం శివాలయ నగర్‌లో ఉంటూ పెయింటర్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, కుమార్తె (14), కుమారుడు ఉన్నారు. కొద్ది నెలల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమార్తెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే అందరినీ చంపేస్తానని బెదింరించాడు. ఆ తర్వాత కూడా చాలా సార్లు కూతురుపై పడి తన రాక్షస కోరికను తీర్చుకున్నాడు. కొద్దిరోజుల క్రితం బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. ఆమె గర్భం దాల్చినట్లు డాక్టర్లు చెప్పడంతో కూతురిని నిలదీయగా తండ్రి నిర్వాకం బయటపడింది.

 

దీంతో ఇంటికెళ్లి భర్తను నిలదీయగా అందరినీ చంపేస్తానని బెదిరించడంతో ఆమె మిన్నకుండిపోయింది. దీంతో కూతురికి గుట్టుచప్పుడు అబార్షన్ చేయించేందుకు భార్యభర్తలిద్దరూ ప్రయత్నించినా లాక్‌డౌన్ కారణంగా సాధ్యం కాలేదు. ప్రస్తుతం బాలిక ఐదు నెలల గర్భవతి. ఆమె శరీరంలో భారీగా మార్పులు రావడాన్ని గమనించిన స్థానికులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. వారు బాలిక తల్లిని నిలదీయగా తన భర్తే ఆ దారుణానికి పాల్పడినట్లు చెప్పడంతో అతడిని తాళ్లతో కట్టేసి చితకబాది పోలీసులకు అప్పగించారు.

 

ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గొంతెత్తి రోడ్లపైకి వచ్చి కొవ్వొత్తుల ప్రదర్శనలు, నిరసనలు చేయడం తప్పా ఇంకేం చేయలేని మనుషులం మనం. ఎన్ని చట్టాలు వచ్చినా ఇలాంటి అకృత్యాలకు మాత్రం అడ్డుకోలేక పోతున్నాయి. ఇది చేతకాని తనమా..? నిర్లక్ష్యయమా..? ఒకవేళ అవునంటే.. ఇది ఎవరి చేతకానితనం..? ఎవరి నిర్లక్ష్యం..?. ఒకవేళ ఆ బాధితురాలు గనుక బిడ్డకు జన్మనిస్తే.. ఆమె పరిస్థితి ఎలా ఉండేది..? ఆ బాధితురాలు తన తండ్రిని తండ్రిలా చూడాలా..? తన బిడ్డకి జన్మనిచ్చిన బిడ్డ తండ్రిలా.. అంటే తనకి భర్తగా చూడాలా..? ఆ బాధితురాలి తల్లి ఆ పుట్టిన బిడ్డకు అమవుతుంది.. అమ్మమ్మ అవుతుందా..? లేకపోతే తండ్రికి మొదటి భార్య గనుక పెద్దమ్మ అవుతుందా..? ఆ పుట్టే బిడ్డ ఆ తండ్రిని తన తండ్రిలా చూడాలా..? తన తల్లికి తండ్రి కాబట్టి తాతలా చూడలా..? ఇలాంటి ఆగాలంటే చట్టాలు మరతమే కాదు, చరిత్రలో నిలిచిపోయే శిక్షలు కూడా అమలు చెయ్యాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: